Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ - దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ : ఆసక్తిని రేకెత్తిస్తున్న చివరి వన్డే

Webdunia
శనివారం, 24 అక్టోబరు 2015 (11:50 IST)
భారత్ - దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో ఇరు జట్లూ రెండేసి మ్యాచ్‌లలో విజయం సాధించాయి. దీంతో ఆదివారం చరిత్రాత్మక వాంఖడే మైదానంలో జరిగే చివరి వన్డే మ్యాచ్ అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తోంది.
 
 
వన్డే సిరీస్‌కు ముందు ఇరు జట్ల మధ్య జరిగిన ట్వంటీ-20 సిరీస్‌లో భారత జట్టు 2-0తో ఓడిపోయింది. ఆ తర్వాత జరిగిన వన్డే సిరీస్‌లో ఇరు జట్లూ నువ్వూనేనా అన్నట్టు సాగుతున్నాయి. తొలి మ్యాచ్‌లో సఫారీలు గెలుపొందగా, రెండో మ్యాచ్‌లో భారత్, మూడో మ్యాచ్‌లో సౌతాఫ్రికా, నాలుగో మ్యాచ్‌లో ధోనీ గ్యాంగ్ విజయభేరీ మోగించింది. దీంతో సిరీస్‌ 2-2తో సమమైంది. 
 
ఈ నేపథ్యంలో.. ముంబైలో నిర్ణయాత్మకమైన తుదిపోరుకు సిద్ధమైంది. చరిత్రాత్మక వాంఖడే మైదానంలో ఆదివారం ఐదో వన్డే గెలుపుతో సిరీస్‌ని కాపాడుకుని సగర్వంగా ఐసీసీ రెండో ర్యాంకును కూడా నిలుపుకోవాలని భారత్‌ ఆశిస్తోంది. మరోవైపు సఫారీలు కూడా ఒక దెబ్బకు రెండు పిట్టలు చందంగా ఐదో వన్డేలో గెలిచి సిరీస్‌తోపాటు, ర్యాంకు అవకాశాల్ని పెంచుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఏది ఏమైనా రెండు బలమైన జట్లు నువ్వా-నేనా అంటూ ఈనెల 25న మధ్యాహ్నం తలపడే చివరి వన్డేపై అభిమానుల్లో అమితాసక్తి నెలకొంది. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments