Webdunia - Bharat's app for daily news and videos

Install App

సఫారీల వెన్నువిరిచిన భారత బౌలర్లు.. ఫాలోఆన్‌కు ఆహ్వానం

Webdunia
సోమవారం, 21 అక్టోబరు 2019 (14:02 IST)
రాంచి వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో భారత బౌలర్లు విజృంభించారు. ఫలితంగా సఫారీలు చేతులెత్తేశారు. భారత బౌలర్ల ధాటికి సౌతాఫ్రికా జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 162 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రత్యర్థి జట్టును ఫాలోఆన్‌కు ఆహ్వానించాడు. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన భారత జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఫలితంగా భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 116.3 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 497 పరుగులు చేసింది. ఇందులో ఓపెనర్ రోహిత్ శర్మ డబుల్ సెంచరీతో పాటు.. రహానె సెంచరీ, ఉమేష్ యాదవ్ మెరుపు ఇన్నింగ్స్ ద్వారా వచ్చిన 31 పరుగులు ఉన్నాయి. 
 
ఆ తర్వాత తన తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా జట్టు కేవలం 162 పరుగులకే ఆలౌట్ అయింది. జట్టులో ఎల్గర్‌ (0), డికాక్‌ (4),  డుప్లెసిస్ ( 1) ఔట్ కాగా, హంజా గరిష్టంగా 62 పరుగులు చేశాడు. 
 
అలాగే, బవుమా (72 బంతుల్లో 32), క్లాసేన్ (10 బంతుల్లో 6), పైడ్త్ (14 బంతుల్లో 4), రబాడా (6 బంతుల్లో 0), లిండె (81 బంతుల్లో 37), నోర్ట్ జె (55 బంతుల్లో 4), ఎన్గిడి (0, నాటౌట్) వెనుదిరిగారు. దీంతో మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా 335 పరుగుల ఆధిక్యంలో ఉంది. దీంతో దక్షిణాఫ్రికాకు కొహ్లీ సేన ఫాలో‌ఆన్ ఇచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పుల్లెల గోపీచంద్ అకాడమీలో తమ సరికొత్త క్లినిక్‌ను ప్రారంభించిన వెల్నెస్ కో

ప్రియురాలుని బైక్ ట్యాంక్ పైన పడుకోబెట్టి వేగంగా నడుపుతూ యువకుడు రొమాన్స్ (video)

హైద‌రాబాద్‌లో నేష‌న‌ల్ హెచ్ఆర్‌డీ నెట్‌వ‌ర్క్ అత్యాధునిక కార్యాల‌యం

ఆ ఐదు పులులు ఎందుకు చనిపోయాయంటే...

ఎయిరిండియా విమాన ప్రమాదం - దర్యాప్తు అధికారికి ఎక్స్ కేటగిరీకి భద్రత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

తర్వాతి కథనం
Show comments