Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండోర్ మూడో టెస్టు.. పుజారా అదుర్స్.. రెండోసారి డిక్లేర్ చేసిన భారత్

ఇండోర్‌లో భారత్, కివీస్‌ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో భారత్ రెండోసారి కూడా డిక్లేర్ చేసింది. కివీస్ జట్టును ఫాలో ఆన్ ఆడించకుండా సెకండ్ ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ సేన 49 ఓవర్లపాటు బ్యాటింగ్ చేసి,

Webdunia
మంగళవారం, 11 అక్టోబరు 2016 (15:25 IST)
ఇండోర్‌లో భారత్, కివీస్‌ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో భారత్ రెండోసారి కూడా డిక్లేర్ చేసింది. కివీస్ జట్టును ఫాలో ఆన్ ఆడించకుండా సెకండ్ ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ సేన 49 ఓవర్లపాటు బ్యాటింగ్ చేసి, 3 వికెట్లు కోల్పోయి 216 పరుగులు సాధించింది. భారత బ్యాట్స్‌మెన్లలో పుజారా 101(నాటౌట్) పరుగులతో సెంచరీతో అదర గొట్టాడు. 
 
అలాగే గంభీర్ మెరుగ్గా రాణించి హాఫ్ సెంచరీ సాధించాడు. విజయ్ 19, కోహ్లీ 17, రహానే 23(నాటౌట్) పరుగులు చేశారు. దీంతో ప్రత్యర్ధి జట్టు ముందు 475 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని ఉంచింది కోహ్లీ సేన. సెకండ్ బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టు 16 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసింది. మరో 120 ఓవర్లు మిగిలి ఉండటంతో భారత్‌కు విజయం ఖాయమని క్రీడా పండితులు అంటున్నారు. 
 
అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 557/5 పరుగుల వద్ద డిక్లేర్డ్ చేసింది. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 299/10 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 216/3 డిక్లేర్డ్ చేసింది. కివీస్ రెండో ఇన్నింగ్స్ ఆడుతోంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments