Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ ట్వంటీ20 వరల్డ్ కప్ : చిత్తుగా ఓడిన భారత్... ఫైనల్‌లో ఇంగ్లండ్

Webdunia
గురువారం, 10 నవంబరు 2022 (17:03 IST)
ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ టోర్నీ రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ చిత్తుగా ఓడిపోయింది. ఇంగ్లండ్ ఓపెనర్లు వీరబాదుడుకు భారత బౌలర్లు బెంబేలెత్తిపోయారు. ఫలితంగా ఇంగ్లండ్ విజయభేరీ మోగించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టుతో ఇంగ్లండ్ జట్టు తలపడుతుంది.
 
169 పరుగుల విజయలక్ష్యంత బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు ఆడుతూపాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు అలెక్స్ హేల్స్, జోస్ బట్లర్‌రు వీర విహారం చేస్తూ భారత బౌలర్లకు చుక్కలు చూపించారు. భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. 
 
కుదిరితే సిక్స్ లేదంటే ఫోరు బాదుతూ స్కోరు బోర్డును దౌడు తీయించారు. వీరిద్దరూ కలిసి కేవలం 16 ఓవర్లలోనే 170 రన్స్ చేసి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ క్రమంలో హేల్స్ 86, బట్లర్ 80 చొప్పున పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. 
 
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. దీంతో ప్రత్యర్థి ఇంగ్లండ్ ముంగిట 169 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. భారత ఆటగాళ్ళలో ఓపెనర్లు కేఎల్ రాహల్ 5, రోహిత్ శర్మ 27, కోహ్లీ 50, సూర్యకుమార్ యాదవ్ 14, హార్దిక్ పాండ్యా 63, రిషభ్ పంత్ 6 చొప్పున పరుగులు చేశారు. 
 
నిజానికి భారత్ ఓపెనర్లిద్దరినీ 8.5 ఓవర్లలోనే కోల్పోయింది. జట్టు స్కోరు 9 పరుగుల వద్ద ఉండగా, రాహుల్, ఆ తర్వాత 56 పరుగుల వద్ద రోహిత్ శర్మలు ఔట్ అయ్యార్. ఈ క్రమంలో ఎన్నో ఆశలుపెట్టుకున్న సూర్య కుమార్ యాదవ్ కూడా కేవలం 14 పరుగులే చేసి తీవ్ర నిరాశకు లోను చేశారు. ఈ క్రమంలో విరాటో కోహ్లీతో జతకలిసిన హార్దిక్ పాండ్యా జట్టు ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. 
 
వీరిద్దరూ మరో వికెట్ పడకుండా జాగ్రత్త వహించారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యాలు అర్థ సెంచరీలు పూర్తి చేశారు. ఓవరాల్‌గా భారత్ ఇన్నింగ్స్‌లో కోహ్లీ, హార్డిక్ పాండ్యలు జట్టును ఆదుకున్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్ట్, రషీద్‌లు ఒక్కో వికెట్ తీయగా, క్రిస్ జోర్డాన్ మూడు వికెట్లు తీసి భారత్ ఇన్నింగ్స్‌ దెబ్బతీశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి షాక్.. ముసుగు ధరించిన వ్యక్తి నుంచి లెటర్.. రూ.2కోట్లు డిమాండ్

భద్రాచలం వద్ద గోదావరి నది నీటి మట్టం పెంపు.. మూడవ హెచ్చరిక జారీ

9 మంది దొంగలు, ఒక్కడే కమాండర్: టీవీకె విజయ్

TVK Vijay Maanaadu: మధురై మానాడుకి వెళ్తూ మూత్ర విసర్జన చేస్తూ గుండెపోటుతో వ్యక్తి మృతి

India: అమెరికాకు స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు- చైనాను అధిగమించిన భారతదేశం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

రజనీకాంత్‌కు వీరాభిమానిని - అలా చేయడం ఇబ్బందిగా లేదు : అమీర్ ఖాన్

తర్వాతి కథనం
Show comments