Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో భారత్ ఘనవిజయం

Webdunia
మంగళవారం, 23 మార్చి 2021 (22:22 IST)
పుణే వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘనవిజయం సాధించింది. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్, టీ20 సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా.. మూడు వన్డేల సిరీస్‌ తొలి వన్డేలో గ్రాండ్ విక్టరీ కొట్టి శుభారంభం చేసింది. టీమిండియా నిర్దేశించిన భారీ టార్గెట్‌ను చేధించడంలో విఫలమైన ఇంగ్లండ్ జట్టు 251 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. 
 
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసి, ఇంగ్లండ్ ముందు 318 పరుగుల టార్గెట్ పెట్టగా.. 251 పరుగులకే ఇంగ్లండ్ జట్టు పెవిలియన్ చేరింది. దీంతో.. 66 పరుగుల తేడాతో.. ఇంగ్లండ్‌పై విజయం సాధించిన భారత్.. మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది.
 
ఇక, తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు ఏకంగా నలుగురు బ్యాట్స్‌మెన్‌ హాఫ్‌సెంచరీలతో చెలరేగిపోయారు. సెంచరీ చేస్తాడని అంతా భావిస్తున్న తరుణంలో ఓపెనర్ శిఖర్‌ ధావన్ తృటిలో సెంచరీ మిస్ అయ్యారు. 106బంతుల్లో 11 ఫోర్లు, 2సిక్సర్ల సహాయంతో 98 పరుగులు చేశాడు. ఇక, కెప్టెన్ విరాట్‌ కోహ్లీ 60 బంతుల్లో ఆరు ఫోర్లతో 56 పరుగులు చేయగా.. 43 బంతుల్లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో చెలరేగిపోయిన కేఎల్‌ రాహుల్ 62 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు..
 
మరోవైపు.. 31 బంతుల్లో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో రెచ్చిపోయిన కృనాల్‌ పాండ్య 58 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇలా.. టీమిండియా బ్యాట్స్‌మెన్స్ వీరవిహారం చేయడంతో 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 317 పరుగులు చేశారు. ఇక, రోహిత్‌ శర్మ(28), శ్రేయస్‌ అయ్యర్‌(6), హార్దిక్‌ పాండ్య(1) మాత్రమే చేశారు. మొత్తంగా అన్ని ఫార్మాట్లలోనూ ఇంగ్లండ్‌పై ఆధిక్యాన్ని కనబరుస్తూ వస్తోంది టీమిండియా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వల్లభనేని వంశీకి హైకోర్టులో ఎదురుదెబ్బ-వారం పాటు వాయిదా

పౌరసత్వం కేసు : చెన్నమనేని రమేష్‌కు హైకోర్టు షాక్.. రూ.25 లక్షలు చెల్లింపు

Janavani: జనవాణి కోసం రీ షెడ్యూల్.. వేసవికాలం కావడంతో పనివేళల్లో మార్పులు

భర్తను కరెంట్ షాకుతో చంపి పాతిపెట్టింది... ఎక్కడ?

క్రికెట్‌ ఆడుతూ గుండెపోటుతో వ్యక్తి అరెస్ట్.. ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందుకే సీక్వెల్స్ కు దూరం - సారంగపాణి జాతకం థ్రిల్లర్, కామెడీ : శివలెంక కృష్ణ ప్రసాద్

Deverakonda : ముత్తయ్య నుంచి సీనిమాల యాక్ట్ జేశి.. సాంగ్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

NTR: మంగళూరులో రెండు మాస్ ఇంజిన్లు సిద్ధం అంటూ ఎన్.టి.ఆర్. చిత్రం అప్ డేట్

Malavika: హీరోయిన్లను అలా చూపించేందుకు దర్శకులు ఇష్టపడతారు

Anushka: ఘాటి చిత్ర విజయంపై అనుష్క శెట్టి కెరీర్ ఆధారపడి వుందా?

తర్వాతి కథనం
Show comments