Webdunia - Bharat's app for daily news and videos

Install App

పింక్ టెస్ట్ : కోహ్లీ సెంచరీ.. భారత్ డిక్లేర్డ్.. కష్టాల్లో బంగ్లాదేశ్

Webdunia
శనివారం, 23 నవంబరు 2019 (19:08 IST)
కోల్‌కతా వేదికగా జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆతిథ్య భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది. రెండో రోజున టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. ఆ తర్వాత భారత్ తన తొలి ఇన్నింగ్స్‌ను 9 వికెట్లకు 347 పరుగులు చేయగా, అదే స్కోరు వద్ద డిక్లేర్డ్ చేశాడు. దీంతో భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 241 పరుగుల ఆధిక్యాన్ని కూడగట్టుకుంది. 
 
అయితే తన బౌలర్ల ప్రదర్శన పట్ల విశ్వాసం ఉంచిన కోహ్లీ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసేందుకు వెనుకాడలేదు. షమీ, ఉమేశ్, ఇషాంత్‌లతో కూడిన టీమిండియా పేస్ దళాన్ని ఎదుర్కొని 200 పైచిలుకు పరుగులు చేయడం బంగ్లాకు తలకు మించిన పనే! ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 106 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే.
 
మరోవైపు, రెండో రోజు ఆట తొలి సెషన్‌లో కోహ్లీ (136) సెంచరీ హైలైట్ అని చెప్పాలి. పింక్ బంతిని ఎదుర్కోవడం తొలిసారే అయినా ఎంతో పట్టుదల కనబర్చిన కోహ్లీ అద్భుతరీతిలో శతకం సాధించాడు. అంతకుముందే రహానే (51), జడేజా (12) కూడా వెనుదిరిగారు. బంగ్లా బౌలర్లలో అల్ అమీన్ 3, ఇబాదత్ 3, అబు జాయేద్ 2 వికెట్లు సాధించారు.
 
అంతకుముందు... రెండో రోజు ఆట తొలి సెషన్‌లో కోహ్లీ దూకుడుగా ఆడి రికార్డు సెంచరీ నమోదు చేయగా.. రహానే ఓపికగా ఆడి, అర్థ సెంచరీ సాధించాడు. తొలి సెషన్‌ను భారత్ 4 కోల్పోయి, 289 పరుగులతో ముగించింది. 
 
లంచ్ విరామం అనంతరం రెండో ఓవర్లోనే జడేజా వికెట్ కోల్పోయిన మరికాసేపటికే కెప్టెన్ విరాట్ 136 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఇబాదత్ హుసేన్ బౌలింగ్‌లో ఔటవడంతో, మిగితా బ్యాట్స్‌మెన్ అడపాదడపా బౌండరీలు బాదినప్పటికీ క్రీజులో నిలదొక్కుకోక, పెవిలియన్‌కు క్యూ కట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నీ భర్త వేధిస్తున్నాడా? నా కోరిక తీర్చు సరిచేస్తా: మహిళకు ఎస్.ఐ లైంగిక వేధింపులు

గూగుల్ మ్యాప్ ముగ్గురు ప్రాణాలు తీసింది... ఎలా? (video)

ప్రేయసిని కత్తితో పొడిచి నిప్పంటించాడు.. అలా పోలీసులకు చిక్కాడు..

నీమచ్‌లో 84,000 చదరపు అడుగుల మహాకాయ రంగోలి ఆసియా వరల్డ్ రికార్డు

పోసాని కృష్ణమురళి రెడ్డి అని పేరు పెట్టుకోండి: పోసానిపై నటుడు శివాజి ఆగ్రహం (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దేవీశ్రీ ప్రసాద్ లేనిదే నా జర్నీ శూన్యం - నా లైఫ్ మార్చింది ఆ దర్శకుడే : తేల్చిచెప్పిన అల్లు అర్జున్

చెన్నైలో అల్లు అర్జున్, శ్రీలీల 'పుష్ప 2 ది రూల్' మూడవ సింగిల్ 'కిస్సిక్' రిలీజ్

ఇండియా, యుకె, యుఎస్ఏ వ్యాప్తంగా తమ బ్రేక్ త్రూ 2024 కోసం ఎంపికైన వ్యక్తులను వెల్లడించిన బాఫ్టా

సరైన అనుమతులు లేకుండా ఫామ్‌హౌస్‌ నిర్మాణం-నటుడు అలీకి నోటీసులు

పుష్ప-2 రికార్డు బద్ధలు: కిసిక్ సాంగ్‌ రిలీజ్.. ఎప్పుడంటే?

తర్వాతి కథనం
Show comments