Webdunia - Bharat's app for daily news and videos

Install App

అండర్-19 వరల్డ్ కప్ : భారత్ ముంగిట 217 పరుగుల టార్గెట్

అండర్-19 ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా శనివారం భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య తుది పోరు సాగుతోంది. ఇందులోభాగంగా, తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 47.2 ఓవర్లలో 216 పరుగులు చేసి ఆలౌట్ అయింది.

Webdunia
శనివారం, 3 ఫిబ్రవరి 2018 (10:14 IST)
అండర్-19 ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా శనివారం భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య తుది పోరు సాగుతోంది. ఇందులోభాగంగా, తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 47.2 ఓవర్లలో 216 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత యువ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆసీస్ ఆటగాళ్లు పరుగులు చేసేందుకు కంగారు పడిపోయారు. 
 
ఈ మ్యాచ్ ఆరంభంలో బాగానే ఆడినా.. స్పిన్న‌ర్లు దిగిన త‌ర్వాత సీన్ మారిపోయింది. ఇషాన్ పోరెల్‌, న‌గ‌ర్‌కోటి, అనుకూల్‌రాయ్‌, శివ సింగ్ తలా నాలుగు వికెట్లు తీసుకున్నారు. ఒక ద‌శ‌లో 134 ప‌రుగుల‌కే 3 వికెట్ల‌తో ఉన్న ఆసీస్‌.. 82 ప‌రుగుల తేడాలో 7 వికెట్లు కోల్పోయింది. ముఖ్యంగా చివ‌రి ప‌ది ఓవ‌ర్ల‌లో ఆసీస్‌ను భారత బౌలర్లు పూర్తిగా క‌ట్ట‌డి చేశారు. 
 
ఇప్ప‌టికే మూడేసి సార్లు వ‌రల్డ్‌క‌ప్ గెలిచిన ఇండియా, ఆస్ట్రేలియా.. ఇప్పుడు రికార్డు స్థాయిలో నాలుగో వ‌ర‌ల్డ్‌క‌ప్‌పై క‌న్నేశాయి. శుభ్‌మాన్ గిల్‌, పృథ్విషా, మ‌న్‌జోత్ క‌ల్రాల‌తో కూడిన ప‌టిష్ట టాపార్డ‌ర్ ఈ ల‌క్ష్యాన్ని సునాయాసంగా చేదించే అవ‌కాశాలు ఉన్నాయి. భారత యువ జట్టుకు క్రికెట్ లెజెండ్ రాహుల్ ద్రావిడ్ ప్రధాన కోచ్‌గా ఉన్న విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్తను కరెంట్ షాకుతో చంపి పాతిపెట్టింది... ఎక్కడ?

AP SSC Result 2025: ఏప్రిల్ 22న 10వ తరగతి పరీక్షా ఫలితాలు

పోప్ ప్రాన్సిస్ ఇకలేరు -వాటికన్ కార్డినల్ అధికారిక ప్రకటన

ప్రతిదానికీ హెలికాఫ్టర్ కావాలంటే ఇలానే అవుతాది మరి (Video)

తెలంగాణకు ఎల్లో అలెర్ట్.. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: మంగళూరులో రెండు మాస్ ఇంజిన్లు సిద్ధం అంటూ ఎన్.టి.ఆర్. చిత్రం అప్ డేట్

Malavika: హీరోయిన్లను అలా చూపించేందుకు దర్శకులు ఇష్టపడతారు

Anushka: ఘాటి చిత్ర విజయంపై అనుష్క శెట్టి కెరీర్ ఆధారపడి వుందా?

శివరాజ్ కుమార్ చిత్రం వీర చంద్రహాస తెలుగులో తెస్తున్న ఎమ్‌వీ రాధాకృష్ణ

Dhanush: కుబేర ఫస్ట్ సింగిల్ పోయిరా మామా..లో స్టెప్ లు అదరగొట్టిన ధనుష్

తర్వాతి కథనం
Show comments