Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్ట్రేలియాతో ట్వంటీ20 సమరం : నెహ్రా, కార్తీక్‌లకు పిలుపు

ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ముగిసింది. ఇకపై 20 ఓవర్ల ట్వంటీ-20 సిరీస్ ఆరంభంకానుంది. వన్డే సిరీస్‌ను భారత క్రికెట్ జట్టు 4-1 ఆధిక్యంతో కైవసం చేసుకున్న విషయం తెల్సిందే. దీంతో ఈనెల 7వ తేదీ నుంచి ప్రారంభమయ్

Webdunia
సోమవారం, 2 అక్టోబరు 2017 (09:49 IST)
ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ముగిసింది. ఇకపై 20 ఓవర్ల ట్వంటీ-20 సిరీస్ ఆరంభంకానుంది. వన్డే సిరీస్‌ను భారత క్రికెట్ జట్టు 4-1 ఆధిక్యంతో కైవసం చేసుకున్న విషయం తెల్సిందే. దీంతో ఈనెల 7వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ట్వంటీ-20 సిరీస్‌ కోసం జాతీయ సెలక్షన్ కమిటీ జట్టును ప్రకటించింది. ఇందులో వెటరన్ ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రా, వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ దినేశ్ కార్తీక్‌లకు చోటుకల్పించారు. 
 
అలాగే ఆసీస్‌తో సిరీస్‌కు దూరంగా ఉన్న ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా తిరిగి జట్టులో చేరనున్నాడు. భార్య అస్వస్థతో బాధపడుతుండడంతో ధవన్ ఆసీస్‌తో సిరీస్‌కు అందుబాటులో లేకుండా పోయిన విషయం తెల్సిందే. కాగా, టీ20 జట్టులో ఓపెనర్ అజింక్యా రహానే, శార్దూల్ ఠాకూర్‌లకు చోటు దక్కలేదు. టెస్టులు, వన్డేల్లో ప్రస్తుతం ప్రపంచ నంబర్ వన్‌గా ఉన్న టీమిండియా శనివారం రాంచీలో జరగనున్న తొలి టీ20లో ఆసీస్‌తో తలపడనుంది.
 
జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధవన్, కేఎల్ రాహుల్, మనీష్ పాండే, కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్, మహేంద్రసింగ్ ధోనీ, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, జస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, ఆశిష్ నెహ్రా, అక్సర్ పటేల్ 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Celebrities: ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు..సెలెబ్రిటీల వైపు మళ్లిన చర్చ.. అర్జున్ రెడ్డిపై ప్రశంసలు

Hyderabad: గర్భవతి అయిన భార్యను హత్య చేసిన భర్త

వావ్... మనం గెలిచాం, ఎగిరి కౌగలించుకున్న కుక్క (video)

Telangana: తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకు రంగం సిద్ధం.. త్వరలో నోటిఫికేషన్

Telangana: తెలంగాణలో సెప్టెంబర్ నుండి రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Rohit: తను నా లక్కీ చార్మ్.. అందుకే సుందరకాండ చేశాం : నారా రోహిత్

బార్బరిక్.. ఫ్రీగా చూడాల్సిన మూవీ కాదని వాళ్లు డబ్బులు ఇచ్చారు : విజయ్ పాల్ రెడ్డి

సినిమాల్లోనే కాదు.. వ్యక్తిగతంగా లోపాలను వెతుకుతున్నారు : అనుపమ పరమేశ్వరన్

కపుల్ ఫ్రెండ్లీ లో సంతోష్ శోభన్, మానస వారణాసి ల కెమిస్ట్రీ సాంగ్

పవన్ చేతిపై ఉన్న టాటూ అక్షరాలకు అర్థమేంటి?

తర్వాతి కథనం
Show comments