Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోహి(ట్)త్ శర్మకు ఏమైంది.. ఇలా చేశాడు...

Webdunia
మంగళవారం, 5 మార్చి 2019 (15:43 IST)
భారత డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ తన సొంత గడ్డపై పూర్తిగా నిరాశపరిచాడు. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా, పర్యాటక ఆస్ట్రేలియా జట్టుతో భారత్ రెండో వన్డే మ్యాచ్‌ను మంగళవారం నాగ్‌పూర్ వేదికగా ఆడుతోంది. ఇందులో తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా.. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లు క్రీజ్‌లోకి వచ్చారు. అయితే, రోహిత్ శర్మ తొలి ఓవర్ ఆఖరు బంతికి డకౌట్ అయ్యాడు. తన కెరీర్‌లో అదీ సొంతగడ్డపై రోహిత్ ఇలా ఔట్ కావడం ఇదే తొలిసారి. దీంతో సొంతూరి క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. 
 
కాగా, ఆదివారం హైదరాబాద్‌ వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత్ విజయభేరీ మోగించిన విషయం తెల్సిందే. ఈ ఉత్సాహంతోవున్న కోహ్లిసేన ఈ మ్యాచ్‌ను సైతం గెలిచి సిరీస్‌లో ఆధిపత్యం ప్రదర్శించాలని భావిస్తోంది. ఇక ఈ మ్యాచ్‌లో ఎలాంటి మార్పులు లేకుండా భారత్‌ బరిలోకి దిగింది. ఇక ఆసీస్‌ రెండు మార్పులు చేసింది. టర్నర్‌, జాసన్‌ బెహెండ్రాఫ్‌లకు ఉద్వాసన పలికి షాన్‌ మార్ష్‌, నాథన్‌ లియోన్‌లకు అవకాశం కల్పించింది. తొలి వన్డేలో భారత్‌ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో ఆధిక్యంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఆసీస్‌ నిర్దేశించిన 237 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 48.2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
 
ఇపుడు రెండో వన్డే మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు ఓపెనర్లుగా రోహిత్ శర్మ, ధావన్‌లు క్రీజ్‌లోకి వచ్చారు. తొలి ఆస్ట్రేలియా బౌలర్ కుమ్మిన్స్ వేసిన చివరి ప్యాట్ కుమ్మిన్స్ వేసిన ఆఖరి బంతికి రోహిత్‌ డకౌట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఎక్స్‌ట్రా బౌన్స్‌ రూపంలో వచ్చిన ఆ బంతిని అప్పర్‌ కట్‌కు యత్నించిన రోహిత్‌.. ఆడమ్‌ జంపాకు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. దాంతో స్కోరు బోర్డుపై పరుగులేమీ లేకుండానే భారత్‌ వికెట్‌ను కోల్పోయినట్లయ్యింది. మధ్యానం 3.30 గంటల సమయంలో భారత్ స్కోరు 31.4 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 167 పరుగలు చేసింది. క్రీజ్‌లో కెప్టెన్ కోహ్లీ (67), జాధవ్ (7)లు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ రాష్ట్రానికి శుభవార్త చెప్పిన కేంద్రం.. ఏంటది?

ట్రాఫిక్ పోలీస్ కూతురిని ఎత్తుకుని ముద్దాడిన బాలయ్య (video)

ఏపీఎస్ఆర్టీ ఏసీ బస్సుల్లో 20 శాతం రాయితీ

వివాహేతర సంబంధం: పెళ్లయ్యాక మరొక వ్యక్తితో ఇష్టపూర్వక శృంగారం తప్పు కాదు కానీ...

కేరళ తిరూర్.. ఎలక్ట్రిక్ వాహనంలో మంటలు.. టూవీలర్‌పై జర్నీ చేసిన వారికి?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నుంచి మరో లిరికల్ సాంగ్.. ఎలావుందంటే?(Video)

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments