Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెల్‌బోర్న్ టెస్ట్ : కంగారెత్తించిన భారత బౌలర్లు .. పీకల్లోతు కష్టాల్లో ఆసీస్

Webdunia
సోమవారం, 28 డిశెంబరు 2020 (13:05 IST)
బోర్డర్ - గవాస్కర్ సిరీస్‌లో భాగంగా మెల్‌బోర్న్ వేదికగా రెండో టెస్ట్ మ్యాచ్ భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో సోమవారం మూడో రోజు ఆట ముగిసింది. ఈ ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉంది. 
 
రెండో ఇన్నింగ్స్ ఆడుతోన్న ఆసీస్ ప్రస్తుతం రెండు పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆటముగిసే సమయానికి ఆసీస్ ఆరు వికెట్లు కోల్పోయి 133 పరుగులు మాత్రమే చేసింది. మొదటి ఇన్నింగ్స్‌లోనూ భారత బౌలర్ల ధాటికి ఆసీస్ 195 పరుగలకే ఆలౌట్ అయిన విషయం తెలిసిందే.
 
అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగులు చేసింది. టీమిండియా బ్యాట్స్‌మెన్‌లో మయాంక్ అగర్వాల్ 0,  శుభ్‌మాన్ గిల్ 45, చటేశ్వర్ పుజారా 17, హనుమ విహారి 21, రిషబ్ పంత్ 29, అజింక్యా రహానె 112, రవీంద్ర జడేజా 57, రవిచంద్రన్ అశ్విన్ 14, ఉమేశ్ యాదవ్ 9, బుమ్రా 0, సిరాజ్ 0 (నాటౌట్) పరుగులు చేశారు. 
 
అలాగే, ఆస్ట్రేలియా జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 195 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లోనూ ఆసీస్ ఆటగాళ్లు కంగారెత్తిపోయారు. ఫలితంగా క్రీజ్‌లో నిలదొక్కుకోలేక పోయారు. ఓపెనర్లలో బర్న్స్ 4, వాడే 40 పరుగులు చేయగా, లుబ్సజ్ఞే 28, స్మిత్ 8, హెడ్ 17, గ్రీన్ 17 (నాటౌట్), పైనే 1, కమ్మిన్స్ 15 చొప్పున పరుగులు చేయగా, ఎక్స్‌ట్రాల రూపంలో మూడు పరుగులు వచ్చాయి. భారత బౌలర్లలో జడేజాకు రెండు, బుమ్రా, ఉమేశ్ యాదవ్, సిరాజ్, అశ్విన్‌కు తలో వికెట్ దక్కాయి. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments