Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొహాలీ వన్డే : కోహ్లీ - ధోనీ వీరవిహారం.. భారత్ విజయం... సిరీస్‌లో 2-1తో ఆధిక్యం

మొహాలీ వేదికగా జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో భారత జట్టు విజయంభేరీ మోగించింది. కెప్టెన్‌ ధోనీ, వైస్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ వీరోచిత ఆటతీరుతో చెలరేగడంతో మూడోవన్డేలో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో న్యూజిలా

Webdunia
సోమవారం, 24 అక్టోబరు 2016 (09:54 IST)
మొహాలీ వేదికగా జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో భారత జట్టు విజయంభేరీ మోగించింది. కెప్టెన్‌ ధోనీ, వైస్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ వీరోచిత ఆటతీరుతో చెలరేగడంతో మూడోవన్డేలో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై గెలిచింది. 
 
తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్దేశించిన 286 పరుగుల లక్ష్యాన్ని భారత మూడు వికెట్లు కోల్పోయి మరో పది బంతులు మిగిలుండగానే చేరుకుంది. కోహ్లీ (134 బంతుల్లో 16 ఫోర్లు, సిక్సర్‌తో 154 నాటౌట్‌) అజేయ శతకానికి తోడు ధోనీ (91 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 80) అర్థ సెంచరీతో రాణించాడు. కివీస్‌ బౌలర్లలో హెన్రీ రెండు, సౌథీ ఒక వికెట్‌ పడగొట్టారు. సెంచరీ హీరో కోహ్లీకే 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్' దక్కింది. 
 
అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌ 49.4 ఓవర్లలో 285 పరుగులకు ఆలౌటైంది. టామ్‌ లాథమ్‌ (61), రాస్‌ టేలర్‌ (44) రాణించారు. 199 పరుగులకే 8 వికెట్లు పడిన దశలో ఆల్‌రౌండర్‌ జేమ్స్‌ నీషమ్‌ (47 బంతుల్లో 7 ఫోర్లతో 57), మాట్‌ హెన్రీ (39 నాటౌట్‌) తొమ్మిదో వికెట్‌కు 84 పరుగులు జోడించి ఆదుకున్నారు. భారత బౌలర్లలో కేదార్‌ జాదవ్‌, ఉమేష్‌ యాదవ్‌ మూడేసి వికెట్లు పడగొట్టగా.. బుమ్రా, అమిత మిశ్రాకు చెరో రెండు వికెట్లు దక్కాయి. 
 
ఆ తర్వాత భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. రోహిత్ శర్మ 13, రహానే 5, కోహ్లీ 154 (నాటౌట్), ధోనీ 80, మనీష్ పాండే 28 పరుగులతో రాణించడంతో మరో రెండు బంతులు మిగిలివుండగానే గెలుపుతీరానికి చేరుకుంది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును విరాట్ కోహ్లీ గెలుచుకున్నాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

US : అమెరికాలో ప్రమాదం.. కాలి బూడిదైన హైదరాబాద్ వాసులు.. నలుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌ వరదలు: బ్యాంకు కొట్టుకుపోయింది.. బంగారం, నగదు ఏమైంది?

Roman: రష్యా మంత్రి రోమన్‌ ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?

జపాన్‌లో వరుసగా భూకంపాలు- మణిపూర్‌లో భయం భయం.. యుగాంతం ఎఫెక్టేనా?

ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రేయసి మృతి.. ప్రియుడు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

తర్వాతి కథనం
Show comments