Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొహాలీ టెస్ట్ : ఇంగ్లండ్ ఫస్ట్ ఇనింగ్స్‌లో 283 పరుగుల వద్ద ఆలౌట్

మొహాలీలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టులో తొలి రోజు ఆటను 8 వికెట్ల నష్టానికి 268 పరుగుల వద్ద ముగించిన ఇంగ్లండ్ జట్ట, రెండో రోజు ఆరంభంలోనే చాపచుట్టేసింది. తొలి రోజు స్కోరుకు 15 పరుగుల

Webdunia
ఆదివారం, 27 నవంబరు 2016 (10:04 IST)
మొహాలీలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టులో తొలి రోజు ఆటను 8 వికెట్ల నష్టానికి 268 పరుగుల వద్ద ముగించిన ఇంగ్లండ్ జట్ట, రెండో రోజు ఆరంభంలోనే చాపచుట్టేసింది. తొలి రోజు స్కోరుకు 15 పరుగులను మాత్రమే చేర్చగలిగింది. నాలుగు ఓవర్లు కూడా పూర్తి కాకుండానే చేతిలో మిగిలివున్న రెండు వికెట్లనూ కోల్పోయింది. 
 
ఆదివారం రెండో ఓవర్‌ను వేసిన షమీకి... అంటే ఇన్నింగ్స్ 91.1 బంతికి రషీద్, ఆపై 93.5వ బంతికి బాట్టీ వికెట్ల ముందు దొరికిపోయారు. ఇద్దరి వికెట్లూ షమీకే చిక్కాయి. ఇంగ్లండ్ జట్టు 283 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. 
 
అంతకుముందు. ఇంగ్లండ్ ఈమ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విషయం తెల్సిదే. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఎనిమిది వికెట్లకు 268 పరుగులు చేసింది. జానీ బెయిర్‌స్టో (117 బంతుల్లో 6 ఫోర్లతో 89) అర్థ శతకంతో మెరవగా, జోస్‌ బట్లర్‌ (80 బంతుల్లో 5 ఫోర్లతో 43) రాణించాడు. ఓపెనర్‌ హసీబ్‌ హమీద్‌ (9), జో రూట్‌ (15), మొయిన్‌ అలీ (16) నిరాశ పరిచారు. కెప్టెన్‌ అలిస్టర్‌ కుక్‌ (27)తో పాటు బెన్‌ స్టోక్స్‌ (29), క్రిస్‌ వోక్స్‌ (25) శుభారంభాలను సద్వినియోగం చేసుకోలేకపోయారు. 
 
ఒక దశలో 87 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును బెయిర్‌స్టో ఒంటరి పోరాటంతో ఆదుకున్నాడు. భారత బౌలర్లలో జయంత యాదవ్‌, రవీంద్ర జడేజా, ఉమేష్‌ యాదవ్‌ తలో రెండు వికెట్లు పడగొట్టారు. మహ్మద్‌ షమి, అశ్విన్‌ చెరో వికెట్‌ తీశారు. రెండో రోజున చివరి రెండు వికెట్లూ షమీకే దక్కాయి. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments