Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహ్లీ మ్యాచ్ గెలిచాక షేక్ హ్యాండ్ ఇవ్వలేదు.. అహం ఎక్కువ.. సారీ చెప్పాలి: ఆసీస్ మీడియా

భారత్ గడ్డపై ఆస్ట్రేలియా జట్టు ఓడిపోవడంపై ఆ దేశ మీడియా జీర్ణించుకోలేకపోతోంది. గతంలో కోహ్లీని ఏకిపారేసినట్లే.. మళ్లీ కోహ్లీపై ఆసీస్ మీడియా అక్కసును వెళ్లగక్కింది. కోహ్లీకి అహంకారం ఎక్కువని.. అందుకే దిగ

Webdunia
బుధవారం, 29 మార్చి 2017 (18:36 IST)
భారత్ గడ్డపై ఆస్ట్రేలియా జట్టు ఓడిపోవడంపై ఆ దేశ మీడియా జీర్ణించుకోలేకపోతోంది. గతంలో కోహ్లీని ఏకిపారేసినట్లే.. మళ్లీ కోహ్లీపై ఆసీస్ మీడియా అక్కసును వెళ్లగక్కింది. కోహ్లీకి అహంకారం ఎక్కువని.. అందుకే దిగజారి ప్రవర్తించడంతో పాటు చిన్నపిల్లాడి వ్యవహరిస్తున్నాడని ఆసీస్ మీడియా ఘాటుగా విమర్శలు గుప్పించింది. 
 
బీర్‌ పార్టీకి రావాలని కెప్టెన్‌ స్మిత్‌.. తాత్కాలిక కెప్టెన్‌ రహానేను కోరగా అందుకు రహానే అంగీకరించకపోవడాన్ని కూడా ఆస్ట్రేలియా మీడియా తప్పుపట్టింది. ఇక ధర్మశాల క్రికెట్ మ్యాచ్ పూర్తయిన వెంటనే కోహ్లీ మీడియా ముందు మాట్లాడిన వైనాన్ని ఆసీస్ మీడియా తప్పుబట్టింది. దీంతో కోహ్లీని టార్గెట్ చేస్తూ.. ఆస్ట్రేలియాకు చెందిన పలు మీడియా సంస్థలు ఫైర్ అయ్యాయి. 
 
టెస్ట్‌ సిరీస్‌ను 2-1తో గెలిచిన అనంతరం కోహ్లీ మాట్లాడుతూ.. ఆస్ట్రేలియా ఆటగాళ్లను ఇకపై స్నేహితులుగా పరిగణించలేనని కామెంట్స్ చేశాడు. అంతేగాకుండా విజయానికి అనంతరం.. కోహ్లీ షేక్ హ్యాండ్ కూడా చేయకపోవడం ఆసీస్ మీడియా మండిపడింది. 
 
కోహ్లీకి అహం ఎక్కువని సిడ్నీ నుంచి వెలువడే డైలీ టెలిగ్రాఫ్‌ ఆరోపించింది. మురళీ విజయ్‌పై నోరు పారేసుకున్నందుకు ఆస్ట్రేలియా కెప్టెన్‌ స్మిత్‌ క్షమాపణ చెప్పాడని.. కోహ్లీ కూడా క్షమాపణ చెప్పాలని హెరాల్డ్‌ సన్‌ జర్నలిస్ట్‌ రసెల్ డిమాండ్ చేశారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

నాదీ తప్పున్నది, నా కోరిక ప్రకారమే జరిగింది: అత్యాచార బాధితురాలు

11 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి కుంభమేళా వెళ్తున్న కామాంధుడు

నకిలీ బంగారం ఇచ్చారు.. అసలు బంగారాన్ని కొట్టేశారు.. వీడియో వైరల్

హే పవన్... హిమాలయాలకు వెళ్తావా ఏంటి: ప్రధాని ప్రశ్నతో పగలబడి నవ్విన పవర్ స్టార్ (Video)

కేసీఆర్ రాజకీయ శకం ముగిసింది.. బీఆర్ఎస్ తుడిచిపెట్టుకుపోతుంది.. మహేష్ జోస్యం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ సినిమాకు పారితోషికం తగ్గించేసిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

ఆలోజింపచేసేలా ధనరాజ్‌ చిత్రం రామం రాఘవం - చిత్ర సమీక్ష

స్వప్నాల నావతో సిరివెన్నెలకి ట్రిబ్యూట్ ఇచ్చిన దర్శకులు వి.ఎన్.ఆదిత్య

విమానంలో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్న మెగాస్టార్ చిరంజీవి

కాంతార: చాప్టర్ 1లో అతిపెద్ద యుద్ధ సన్నివేశం.. అడవుల్లో 50 రోజులు

తర్వాతి కథనం
Show comments