Webdunia - Bharat's app for daily news and videos

Install App

303 పరుగులతో కరుణ్ నాయర్ అదుర్స్.. కానీ కోహ్లీ నిర్ణయంతో సెహ్వాగ్ రికార్డు అవుట్..

ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా క్రికెటర్లు అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంటున్నారు. అరుదైన రికార్డులను నెలకొల్పుతున్నారు. జట్టులో నలుగురు నాలుగు సెంచరీలు బాది అరుదైన ఫీట్‌ను నమోదు చేసుకో

Webdunia
సోమవారం, 19 డిశెంబరు 2016 (17:41 IST)
ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా క్రికెటర్లు అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంటున్నారు. అరుదైన రికార్డులను నెలకొల్పుతున్నారు. జట్టులో నలుగురు నాలుగు సెంచరీలు బాది అరుదైన ఫీట్‌ను నమోదు చేసుకోవడంతో పాటు టీమిండియా మిడిలార్డర్ ఆటగాడు కరుణ్ నాయర్ సరికొత్త రికార్డు సాధించాడు. ఒక టెస్టు మ్యాచ్‌లో ఐదు అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి అత్యధిక స్కోరు సాధించిన ఆటగాడిగా కరుణ్ నాయర్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. 
 
చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 477 పరుగులకు ఇంగ్లండ్ జట్టు ఆలౌట్ కాగా, అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు కేఎల్ రాహుల్ (199), కరుణ్ నాయర్ (303) అద్భుత ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. వీరికి పార్థివ్ పటేల్ (71), రవిచంద్రన్ అశ్విన్ (67) అండగా నిలవడంతో కోహ్లీ సేన 700 పైచిలుకు పరుగులు సాధించింది. ఇందులో భాగంగా కరుణ్ నాయర్ డబుల్ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా కెరీర్‌లో తొలి సెంచరీని డబుల్ సెంచరీగా మార్చిన మూడో ఆటగాడిగా కరుణ్ నాయర్ నిలిచాడు. గతంలో ఈ ఫీట్‌ను దిలీప్ సర్దేశాయ్, వినోద్ కాంబ్లీ చేశారు. 
 
అయితే టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ నిర్ణయంతో కరుణ్ నాయర్ మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఫీట్‌ను అందుకోలేకపోయాడు. 2008లో చెన్నైలోని చేపాక్ స్టేడియంలో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 319 పరుగులు సాధించిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా జట్టుపై కేవలం 302 బంతుల్లో సెహ్వాగ్ ఈ పరుగులు సాధించడం విశేషం. తాజాగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టులో కరుణ్ నాయర్ 381 బంతుల్లో 303 పరుగులు సాధించడం గమనార్హం. తొలి సెంచరీని ఫోర్‌తో, మలి శతకాన్ని కూడా ఫోర్‌తో సాధించిన నాయర్.. ట్రిపుల్ టన్ కూడా బౌండరీతో సాధించి సగర్వంగా బ్యాటు ఎత్తాడు. 
 
కెరీర్‌లో తొలి సెంచరీ సాధించిన టెస్టులోనే కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ సాధించిన ఆటగాడిగానూ రికార్డు సాధించాడు. అయితే తర్వాత కోహ్లీ 759 పరుగుల వద్ద డిక్లేర్ చేయడంతో ఇక సెహ్వాగ్ రికార్డును చేరుకునే అవకాశాన్ని నాయర్ కోల్పోయాడు. ఇక ఇంగ్లండ్‌పై భారత్ 286 పరుగుల ఆధిక్యంతో నిలిచింది. అనంతరం బ్యాటింగ్ దిగిన ఇంగ్లండ్ 12 పరుగులు సాధించింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఎఫెక్ట్ : టర్కీ, అజర్‌బైజాన్‌ దేశాల వీసాల్లో 50 శాతం క్షీణత

పంజా విసురుతున్న కరోనా వైరస్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

పహల్గాం ఉగ్రదాడి కుట్రకు ప్లాన్ : పాక్ ఆర్మీ చీఫ్‌ జనరల్‌కు బహుమతి!!

మహిళ కాదు.. కిలేడీ. ఏడు నెలల్లోనే 25 పెళ్లిళ్లు.. అదీ 23 ఏళ్లకే భారీ మోసం!

Jagan: దెయ్యాల ప్రభుత్వం నడుస్తోంది.. టైమ్ వస్తే చుక్కలు చూపిస్తాం.. జగన్ వార్నింగ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

తర్వాతి కథనం
Show comments