Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎదురులేని భారత్... లీగ్ దశ పోటీలకు ఘనమైన ముగింపు... నెదర్లాండ్స్‌పై ఘన విజయం..

Webdunia
ఆదివారం, 12 నవంబరు 2023 (21:54 IST)
స్వదేశంలో జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో భారత క్రికెట్ జట్టు వరుస విజయాలతో దూసుకెళుతుంది. ఈ టోర్నీకి చివరి లీగ్ మ్యాచ్‌ ఆదివారం బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్, నెదర్లాండ్స్ జట్లు తలపడగా భారత్ 160 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. ఆ తర్వాత భారీ లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన డచ్ జట్టు 250 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా టీమిండియా ఖాతాలో మరో విజయం వచ్చి చేరింది. ఈ టోర్నీలో మొదటి మ్యాచ్ నుంచి చివరి మ్యాచ్ వరకు అంటే మొత్తం 9 మ్యాచ్‌లలో భారత్ విజయభేరీ మోగించింది. దీంతో మొత్తం 18 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. 
 
ఈ ప్రపంచ కప్ ప్రారంభమైనప్పటి నుంచి భారత్ విజయయాత్ర కొనసాగుంది. లీగ్ దశలో భారత్‌మను ఓడించే జట్టే లేకపోయింది. ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో ఘన విజయం సాధించింది. ఒక ప్రపంచ కప్ ఎడిషన్‌లో వరుసగా తొమ్మిది మ్యాచ్‌లు గెలవడం భారత క్రికెట్ జట్టుకు ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ మ్యాచ్‌తో 2023 ఐసీసీ వన్డే ప్రపంచ కప్ లీగ్ దశ పోటీలు ముగిసిపోయాయి. ఈ నెల 15వ తేదీ నుంచి నాకౌట్ అంటే సెమీ ఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయి. తొలి మ్యాచ్‌లో భారత్ న్యూజిలాండ్ జట్టుతో తలపడుతుంది. 
 
ఇదిలావుంటే, ఆదివారం నాటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఈ టోర్నీలోనే అత్యధిక భారీ స్కోరు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 410 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, గిల్‌లతో పాటు.. విరాట్ కోహ్లీలు అర్థ సెంచరీలోతో రాణించగా, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లు శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్‌కు సెంచరీతో కుమ్మేశారు. ఫలితంగా భారీ టీమిండియా భారీ స్కోరు చేసింది. ఈ నెల 15వ తేదీన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు భారత ఆటగాళ్లకు మంచి ప్రాక్టీస్‌లా నెదల్లాండ్స్ జట్టుతో మ్యాచ్ జరిగింది. 
 
కెప్టెన్ రోహిత్ శర్మ 54 బంతుల్లో 2 సిక్స్‌లు, 8 ఫోర్లతో 61 పరుగులు, మరో ఓపెనర్ గిల్ 32 బంతుల్లో మూడు ఫోర్లు, నాలుగు సిక్స్‌ల సాయంతో 51 పరుగులు చేయగా, విరాట్ కోహ్లీ 56 బంతుల్లో ఓ సిక్సర్, 5 ఫోర్ల సాయంతో 51 పరుగులు చేశారు. ఆ తర్వాత క్రీజ్‌‍లోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్ 94 బంతుల్లో ఐదు సిక్స్‌లు 10 ఫోర్ల సాయంతో 128 పరుగులుు, కేఎల్ రాహుల్ 64 బంతుల్లో 4 సిక్స్‌లు 11 ఫోర్లతో 102 పరుగులు చేశాడు. ఆఖరులో క్రీజ్‌లోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ రెండు పరుగులు చేయగా, అదనంగా 15 పరుగులు వచ్చాయి. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 410 పరుగుల భారీ స్కోరు చేసింది. నెదర్లాండ్స్ బౌలర్లలో మీక్రీన్, మెర్వేలు ఒక్కో వికెట్ తీయగా, లీడీ రెండు వికెట్లు పడగొట్టాడు. దీంతో డచ్ జట్టు ముంగిట 411 పరుగుల విజయలక్ష్యాన్ని భారత్ ఉంచింది. 
 
ఈ లక్ష్య ఛేదన కోసం బరిలోకి దిగిన డచ్ జట్టు.. క్రమం తప్పకుండా వికెట్లను కోల్పోతూ వచ్చింది. ఫలితంగా 47.5 ఓవర్లలో 250 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆ జట్టులో ఓపెనర్లు బర్రేసి 4, మ్యాక్స్ ఓ డౌడ్ 30, అక్రమెన్ 35, ఎంగెల్ బ్రెచెట్ 45, ఎడ్వర్డ్ 17, లీడీ 12, నిడమనురు 54, బీక్ 16, డెర్ మెర్వే 16, దత్ 5 మీకెరెన్ 3(నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. భారత బౌలర్లలో బుమ్రా, సిరాజ్‌, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజాలు రెండేసి వికెట్లు పడగొట్టగా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఒక్కో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో మహ్మద్ షమీకి ఒక్క వికెట్ కూడా దక్కలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

EVM లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మీరు గెలిస్తే ట్యాంపరింగ్ కాదా అంటూ ప్రశ్న

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

తర్వాతి కథనం
Show comments