వెస్టిండీస్‌తో రెండో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌.. ఆ ముగ్గురు శతక్కొట్టారు.. గిల్ అదుర్స్ రికార్డ్

సెల్వి
శనివారం, 11 అక్టోబరు 2025 (15:18 IST)
వెస్టిండీస్‌తో రెండో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 134.2 ఓవర్లలో 5 వికెట్లకు 518 పరుగుల భారీ స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (258 బంతుల్లో 22 ఫోర్లతో 175), శుభ్‌మన్ గిల్ (196 బంతుల్లో 2 సిక్స్‌లతో 16 ఫోర్లతో 129 నాటౌట్) శతకాలతో విజృంభించారు. 
 
నితీష్ కుమార్ రెడ్డి (54 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43), ధ్రువ్ జురెల్ (79 బంతుల్లో 5 ఫోర్లతో 44), కేఎల్ రాహుల్ (54 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 38) హాఫ్ సెంచరీలు చేజార్చుకున్నారు. వెస్టిండీస్ బౌలర్లలో జొమెల్ వారికన్(3/98) మూడు వికెట్లు తీయగా.. రోస్టన్ ఛేజ్ ఓ వికెట్ పడగొట్టాడు.
 
తాజాగా గిల్ చేసిన సెంచరీతో విరాట్ కోహ్లీ సరసన నిలిచాడు. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సెంచరీలు చేసిన సారథిగా కోహ్లితో గిల్‌ సమంగా నిలిచాడు. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన గిల్‌ ఐదో సెంచరీ చేయడం గమనార్హం. విరాట్ 2017, 2018 సంవత్సరాల్లో ఐదేసి సెంచరీలు కొట్టాడు. ప్రస్తుతం విండీస్ ఒక వికెట్ కోల్పోయి 30 పరుగుల వద్ద కొనసాగుతోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Amaravati: అమరావతిలో 3300 కి.మీ సైక్లింగ్, వాకింగ్ ట్రాక్ నెట్‌వర్క్‌

నేను, బ్రాహ్మణి ఇంటి పనులను సమానంగా పంచుకుంటాం.. నారా లోకేష్

తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి, పరిసర ప్రాంతాల్లో నెట్‌వర్క్ నాణ్యతను పరీక్షించిన ట్రాయ్

ఫెయిల్ అయితే భారతరత్న అబ్దుల్ కలాంను గుర్తు తెచ్చుకోండి: చాగంటివారి అద్భుత సందేశం (video)

Matrimony Fraud: వరంగల్‌లో ఆన్‌లైన్ మ్యాట్రిమోని మోసం.. వధువు బంగారంతో పరార్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

తర్వాతి కథనం
Show comments