రాజ్‌‍కోట్ వన్డేలో భారత్ గెలుపు... 2-1 తేడాతో సిరీస్ వశం

Webdunia
ఆదివారం, 8 జనవరి 2023 (10:38 IST)
పర్యాటక శ్రీలంక జట్టుతో శనివారం రాత్రి జరిగిన మూడో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. రాజ్‌కోట్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 91 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. దీంతో 2-1 తేడాతో గెలుపొందింది. 
 
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోరు చేసింది. మిస్టర్ 360గా పేరుగాంచిన బ్యాటర్ సూర్యకుమార్ తనదైనశైలిలో బ్యాట్‌తో వీరవిహారం చేశాడు. శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపిస్తూ 51 బంతుల్లో 112 పరుగులు చేశారు. ఫలితంగా 20 ఓవర్లలో 228 పరుగులుచేసింది. 
 
ఆ తర్వాత భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు కేవలం 137 పరుగులకే ఆలౌట్ అయింది. లంక బ్యాటర్లలో షనక 23, ఓపెనర్ మెండిస్ 23, ధనంజయ డిసిల్వా 22, అసలంక 19 పరుగులు చేశాడు. రెండో టీ20లో ఐదు నోబాల్స్ వేసి విలన్‌గా మారిన అర్షదీప్ సింగ్ మూడో టీ20లో 3 వికెట్లు లంక వెన్ను విరిచాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా 2, ఉమ్రామన్ మాలిక్ 2, చహల్ 2, అక్షర్ పటేల్ 1 వికెట్ చొప్పున తీశాడు. 
 
ఈ మ్యాచ్‌ విజయంతో మూడు టీ20ల సిరీస్‌‍లను టీమిండియా 2-1 కేవసం చేసుకుంది. ఇక ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరుగనుంది. ఇందులోభాగంగా ఈ నెల 10వ తేదీన గౌహతి వేదికగా తొలి మ్యాచ్ జరుగనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Border Villages: ఆ గ్రామాల ప్రజలకు ద్వంద్వ ఓటు హక్కులు

వ్యక్తులు రావచ్చు, పోవచ్చు, కానీ టీడీపీ శాశ్వతంగా ఉంటుంది.. నారా లోకేష్

PM Modi Gifts to Putin: పుతిన్‌కు భగవద్గీతను బహూకరించిన ప్రధాని మోదీ

IndiGo: ఇండిగో విమానాల రద్దు.. కేంద్రాన్ని ఏకిపారేసిన రాహుల్ గాంధీ

అర్థరాత్రి మహిళను లాక్కెళ్లి గ్రామ సచివాలయంలో అత్యాచారం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Gopal Varma: రాంగోపాల్ వర్మ.. షో మ్యాన్..మ్యాడ్ మాన్స్టర్

Shivaj :ఓవర్సీస్ ప్రీమియర్లతో సిద్ధం చేస్తున్న ధండోరా

Dhanush: కృతి స‌న‌న్ తో ప్రేమలో మోసపోయాక యుద్ధమే అంటున్న ధనుష్ - అమ‌ర‌కావ్యం (తేరే ఇష్క్ మై)

అఖండ 2 డిసెంబర్ 12న వస్తోందా నిర్మాతలు ఏమన్నారంటే?

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments