Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రెస్ట్‌చర్చ్‌లో థర్డ్ వన్డే మ్యాచ్ : భారత్ బ్యాటింగ్

Webdunia
బుధవారం, 30 నవంబరు 2022 (08:51 IST)
న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా, బుధవారం చివరిదైన మూడో వన్డే మ్యాచ్‌లో ఆతిథ్య కివీస్ జట్టుతో తలపడుతుంది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. అయితే, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుని భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. 
 
మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా, అక్లాండ్‌లో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ జట్టు ఏడు వికెట్లు తేడాతో గెలుపొందగా, హామిల్టన్ వేదికగా జరగాల్సిన రెండు వన్డే వర్షం కారణంగా రద్దు చేశారు. దీంతో బుధవారం జరిగే థర్డ్ వన్డే మ్యాచ్ ‌ఇరు జట్లకు అత్యంత కీలకంకానుంది. ఈ మ్యాచ్‌లోనూ గెలుపొంది సిరీస్‌ను 2-0 తేడాతో చేజిక్కుంచుకోవాలని ఆతిథ్య కివీస్ ఆటగాళ్లు పట్టుదలతో ఉన్నారు. కానీ, ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 1-1తో సమం చేయాలని టీమిండియా ఆటగాళ్లు భావిస్తున్నారు.
 
ఈ మ్యాచ్ కోసం ప్రకటించిన భారత జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. న్యూజిలాండ్ జట్టులో మాత్రం బ్రాస్‌వెల్ స్థానంలో మిల్నే జట్టులోకి దిగుతున్నారు. కాగా, వన్డే సిరీస్‌కు ముందు జరిగిన టీ20 సిరీస్‌న భారత్ కైవసం చేసుకున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎవరికాళ్లో మొక్కి మంత్రి పదవి తెచ్చుకోవాలనుకోవట్లేదు : కె.రాజగోపాల్ రెడ్డి

24 గంటల్లో భారత్‌కు మరో షాకిస్తాం : డోనాల్డ్ ట్రంప్

Bangladesh: ఐదు నెలల పాటు వ్యభిచార గృహంలో 12 ఏళ్ల బాలిక.. ఎలా రక్షించారంటే?

Pavitrotsavams: తిరుమలలో వార్షిక పవిత్రోత్సవాలు ప్రారంభం

ఆన్‌లైన్ బెట్టింగులు - అప్పులు తీర్చలేక పోస్టల్ ఉద్యోగి ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

తర్వాతి కథనం
Show comments