Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత లెగ్ స్పిన్నర్ అశ్విన్‌కు కరోనా పాజిటివ్

Webdunia
మంగళవారం, 21 జూన్ 2022 (10:33 IST)
ఇంగ్లండ్ పర్యటనకు ముందు భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. భారత లెగ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ కరోనా వైరస్ బారినపడ్డారు. దీంతో ఆయన ఇంగ్లండ్‌కు ఆలస్యంగా బయలుదేరి వెళ్లనున్నారు. భారత క్రికెట్ జట్టు టెస్ట్ సిరీస్ కోసం ఇప్పటికే ఇంగ్లండ్‌కు చేరుకుంది. 
 
స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్ ఆడిన భారత జట్టులో అశ్విన్ ఓ సభ్యుడుగా ఉన్నారు. దీంతో ఆయన ఇంగ్లండ్‌కు వెళ్లలేక పోయారు. ఇపుడు ఇంగ్లండ్ వెళ్లేందుకు కోవిడ్ పరీక్ష చేయగా, ఆయనకు పాజిటివ్ అని తేలింది. 
 
మరోవైపు రోహిత్‌ శర్మ నేతృత్వంలోని భారత టెస్టు జట్టు ఇప్పటికే అక్కడికి చేరుకొని సాధన మొదలెట్టింది. ఈ క్రమంలోనే తాజాగా దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ పూర్తయ్యాక హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌తో పాటు శ్రేయస్‌ అయ్యర్‌, రిషభ్‌ పంత్‌ సోమవారం బయలుదేరి వెళ్లారు.
 
అయితే, అశ్విన్‌ గతనెల భారత టీ20 లీగ్‌లో రాజస్థాన్‌ తరపున ఆడాక బయోబబుల్‌ వీడి తమిళనాడు క్రికెట్‌ అసోసియేషన్‌ డివిజన్‌ 1 లీగ్‌ క్రికెట్‌ ఆడాడు. ఈ క్రమంలోనే అతడికి కరోనా సోకడంతో ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నాడు. ఈ విషయాన్ని ఓ బీసీసీఐ అధికారి పీటీఐకి చెప్పారు. 
 
అందువల్లే సీనియర్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ టీమ్‌ఇండియాతో కలిసి ఇంగ్లాండ్‌కు వెళ్లలేదని, కొవిడ్‌ నుంచి కోలుకున్నాక ప్రొటోకాల్‌ ప్రకారం అక్కడికి బయలుదేరతాడని చెప్పారు. అయితే, శుక్రవారం నుంచి లీకెస్టైర్‌షైర్‌తో ప్రారంభమయ్యే నాలుగు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌కు అశ్విన్‌ అందుబాటులో లేకుండా పోయాడు. జులై 1 నుంచి బర్మింగ్‌హామ్‌లో ప్రారంభమయ్యే టెస్టు మ్యాచ్‌ కల్లా అతడు జట్టుతో కలుస్తాడని స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

ఎమ్మెల్యే రాజాసింగ్‌ ముందస్తు అరెస్టు - విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకున్న పోలీసులు

దేవభూమి అనకనందా నదిలో పడిన మినీ బస్సు : 14 మంది మృతి

రుషికొండ ప్యాలెస్ రహస్యం గుట్టు రట్టు... రహస్యంగా విలాస భవనాలు కట్టారు: గంటా (Video)

ఆ రైల్వే డివిజన్ పరిధిలో నెల రోజుల పాటు అనేక రైళ్లు రద్దు!!

ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి మరో చేదు అనుభవం... ఫైలుపై సంతకం చేసేందుకు నిరాకరించిన మంత్రి!!

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

తర్వాతి కథనం
Show comments