Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూణె వేదికగా తలపడనున్న భారత్ - ఇంగ్లండ్ జట్లు

ఠాగూర్
శుక్రవారం, 31 జనవరి 2025 (09:22 IST)
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య స్వదేశంలో టీ20 క్రికెట్ సిరీస్ జరుగుతుంది. ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్‌లలో తొలి రెండు టీ20 మ్యాచ్‌లలో భారత్ విజయం సాధించగా, మూడో మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు గెలుపొందింది. దీంతో నాలుగో మ్యాచ్ పూణె వేదికగా శుక్రవారం రాత్రి 7 గంటల నుంచి మొదలుకానుంది. అయితే, భారత్ ఈ మ్యాచ్‌లో నెగ్గితే సిరీస్ వశమవుతుంది. అటు మరోసారి ప్రత్యర్థిని దెబ్బతీసి సిరీస్ ఫలితాన్ని ఆఖరి మ్యాచ్‌కు తీసుకెళ్లాలని బట్లర్ సేన కృతనిశ్చయంతో ఉంది. 
 
చివరి మూడు టీ20ల్లోనూ భారత బౌలర్లు ఇంగ్లండ్ భారీ స్కోర్లను అడ్డుకోగలుగుతున్నారు. కానీ రాజ్‌కోట్‌‍లో మాత్రం బ్యాటింగ్ వైఫల్యం దెబ్బతీసింది. స్పిన్నర్ వరుణ్ ఐదు వికెట్లతో అండగా నిలిచినా ప్రయోజనం లేకపోయింది. భారత్ ఛేదనలో మంచు ప్రభావం లేకపోవడంతో. ఇంగ్లండ్ బౌలర్లు బంతిపై పట్టు సాధించారు. 
 
ఇక ఓపెనర్ శాంసన్‌న్ను షార్ట్ పిచ్ బంతుల బలహీనత వెంటాడుతోంది. ఈ సిరీస్‌కు‌ ముందు భీకర ఫామ్‌లో ఉన్నా... తాజా సిరీస్‌లో వరుసగా 26, 5, 3 పరుగులు చేసి నిరాశపరిచాడు. అలాగే రింకూ సింగ్ అందుబాటులో ఉండడంతో ధ్రువ్ జురెల్‌పై వేటు పడవచ్చు. కెప్టెన్ సూర్యకుమార్ క్రీజులో కుదురుకోవాల్సి ఉంది.
 
ఇకపోతే, పర్యాటక జట్టులో కీలక సమయంలో బ్యాటర్లు ఫామ్‌లోకి రావడంతో మూడో టీ20లో ఇంగ్లండ్ విజయం సాధించగలిగింది. ఓపెనర్ డకెట్, లివింగ్స్టన్ తుఫాన్ ఇన్నింగ్స్ భారత్ ఆశలను వమ్ము చేసింది. బౌలింగులో స్పిన్నర్ అదిల్ రషీద్ భారత బ్యాటర్లకు ముకుతాడు వేయడంలో ముందుంటున్నాడు. ఏదేమైనా రెండు విభాగాల్లోనూ మరోసారి రాణించి పుణేలో గెలిచి తీరాలన్న కసితో ఇంగ్లండ్ ఉంది.
 
తుది జట్లు (అంచనా) : భారత్: శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ (కెప్టె న్), హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్, సుందర్ /ఆర్ట్దీప్, బిష్ణోయ్, షమీ, వరుణ్ చక్రవర్తి. 
 
ఇంగ్లండ్: సాల్ట్, డకెట్, బట్లర్ (కెప్టెన్), బ్రూక్, లివింగ్ స్టోన్, స్మిత్, ఒవర్టన్, కార్స్, ఆర్చర్ ఉడ్, రషీద్
 
పిచ్: ఎంసీఏ స్టేడియం సహజంగా స్పిన్నర్లకు అనుకూలిస్తుంటుది. అయితే ఆరంభంలో పేసర్లు కూడా ప్రభావం చూపవచ్చు. తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 166గా ఉంది. టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ తీసుకునే ఆవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

తిరుపతిలో అద్భుతం, శివుని విగ్రహం కళ్లు తెరిచింది (video)

NISAR: శ్రీహరికోటలో జీఎస్ఎల్‌వీ-F16తో నిసార్ ప్రయోగానికి అంతా సిద్ధం

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డీఎస్పీలు మృతి.. చంద్రబాబు, జగన్ సంతాపం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

తర్వాతి కథనం
Show comments