Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్ట్రేలియా రికార్డుపై కన్నేసిన విరాట్ కోహ్లీ

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో సరికొత్త రికార్డుపై కన్నేశాడు. అదీకూడా క్రికెట్ ప్రపంచంలో అత్యంత పటిష్ట జట్టుగా ఉన్న ఆస్ట్రేలియా పేరిట ఉన్న రికార్డును సమం చేయాలని భావిస్తున్నాడు.

Webdunia
శుక్రవారం, 1 డిశెంబరు 2017 (09:32 IST)
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో సరికొత్త రికార్డుపై కన్నేశాడు. అదీకూడా క్రికెట్ ప్రపంచంలో అత్యంత పటిష్ట జట్టుగా ఉన్న ఆస్ట్రేలియా పేరిట ఉన్న రికార్డును సమం చేయాలని భావిస్తున్నాడు. 
 
ప్రస్తుతం శ్రీలంక క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటిస్తోంది. మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా కోహ్లీ సేన ఇప్పటికే 1-0 ఆధిక్యాన్ని కూడబెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో డిసెంబరు 2 నుంచి భారత్‌-శ్రీలంక మధ్య చివరి టెస్టు ప్రారంభంకానుంది. ఈ టెస్ట్ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా ఆసీస్ రికార్డును సమం చేయాలని భావిస్తోంది. 
 
ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక్క ఆస్ట్రేలియా మాత్రమే వరుసగా తొమ్మిది టెస్టు సిరీస్‌ల్లో విజయం సాధించిన ఏకైక జట్టుగా ఉంది. 2005-2008 మధ్య ఆస్ట్రేలియా వరుసగా తొమ్మిది టెస్టు సిరీస్‌ల్లో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో జరిగే టెస్టులో కోహ్లీ సేన విజయం సాధిస్తే ఆస్ట్రేలియా రికార్డును సమం చేసినట్టు అవుతుంది. 
 
వ్యక్తిగతంగా కోహ్లీ కూడా మరో అరుదైన ఘనతకు చేరువయ్యాడు. టెస్టు క్రికెట్లో కోహ్లీ 5వేల పరుగుల మైలురాయిని అందుకోవడానికి కేవలం 25 పరుగుల దూరంలో ఉన్నాడు. ఈ టెస్టులో ఆ పరుగులు పూర్తి చేస్తే భారత్‌ తరఫున టెస్టు క్రికెట్లో 5వేల పరుగుల క్లబ్‌లో చేరిన 11వ ఆటగాడు అవుతాడు. ఇప్పటివరకు కోహ్లీ 62 టెస్టుల్లో 104 ఇన్నింగ్స్‌ల ద్వారా 4,975 పరుగులు సాధించాడు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments