Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరల్డ్ గెలుచుకునేందుకు ఇదే అరుదైన అవకాశం.. మిస్ చేస్తే మరో 12 యేళ్లు వేచి చూడాల్సిందే.. రవిశాస్త్రి

Webdunia
ఆదివారం, 12 నవంబరు 2023 (17:19 IST)
స్వదేశీ గడ్డపై జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో భారత క్రికెట్ జట్టు సభ్యులు భీకర ఫామ్‌లో ఉన్నారని, టైటిల్ విజేతగా నిలిచేందుకు ఇదే సరైన అవకాశం అని భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి అన్నారు. ఒకవేళ ఈ అరుదైన అవకాశాన్ని మిస్ చేసుకుంటే మాత్రం టైటిల్ గెలుచుకునేందుకు మరో 12 యేళ్లు ఆగాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ టోర్నీలో భారత క్రికెటర్లు అమోఘంగా రాణిస్తున్నారని కితాబిచ్చారు. ఆటగాళ్లు రాణిస్తున్న తీరును చూస్తే ఖచ్చితంగా ఈ దఫా కప్ మనదేనని అనిపిస్తుందని రవిశాస్త్రి ఆశాభావం వ్యక్తం చేశాడు. 
 
ఇదే అంశంపై రవిశాస్త్రి మాట్లాడుతూ, టీమిండియాలో ప్రస్తుతం ఏడెనిమిది మంది భీకర ఫామ్‌లో ఉన్నారని, వారిలో చాలామందికి ఇదే చివరి వరల్డ్ కప్ అని తెలిపారు. ఇంత మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు కప్ గెలవలేకపోతే, మళ్లీ ఆ స్థాయిలో ఆడి కప్ గెలవాలంటే మరో మూడు వరల్డ్ కప్‌ల (12 ఏళ్లు) వరకు ఆగాల్సిందేనని అన్నారు. భారత గడ్డపై జరుగుతున్న వరల్డ్ కప్‌‌లో టీమిండియా ఆడుతున్న తీరు, పిచ్‌లు, సాధిస్తున్న విజయాలను పరిశీలిస్తే... ఈసారి కప్ మనదే అనిపిస్తోందని రవిశాస్త్రి పేర్కొన్నారు.
 
ఇక, టీమిండియా పేస్ త్రయం మహ్మద్ షమీ, జస్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌లపై శాస్త్రి ప్రశంసల వర్షం కురిపించారు. 50 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన వన్డే క్రికెట్లో ఇదే అత్యుత్తమ బౌలింగ్ విభాగం అని కొనియాడారు. సీమ్ పొజిషన్, స్వింగ్ రాబట్టే విధానం అమోఘం అని కితాబిచ్చారు. ఇంతటి బలమైన పేస్ విభాగం భారత్‌కు ఎప్పుడూ లేదని, అయితే ఇదేమీ రాత్రికి రాత్రి జరిగింది కాదన్నారు. గత నాలుగైదు సంవత్సరాలుగా ఈ దిశగా ఎంతో కృషి జరిగిందన్నారు. భారత పిచ్‌లపై ఎక్కడ బంతులు విసిరితే వికెట్లు లభిస్తాయో షమీ, బుమ్రా, సిరాజ్‌లకు తెలుసని, దాన్ని మైదానంలో అమలు చేసి సక్సెస్ సాధిస్తున్నారని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

12 మంది భార్యలు... 102 మంది సంతానం... 578 మందికి తాతయ్య..

అన్నా యూనివర్శిటీ ప్రాంగణంలోనే విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

Peelings: పీలింగ్స్ పాటకు డ్యాన్స్ చేయడం రష్మికకు ఇష్టం లేదు.. సీపీఐ నారాయణ

బలహీనపడిన అల్పపీడనం... అయినా వర్షాలు కురుస్తాయనంటున్న ఐఎండీ

మైసూరు పాక్, గులాబ్‌ జామూన్‌, రసగుల్లా.. బడాబాబుల పేర్లు ఇలా.. శ్వేతా గౌడ ఎవరు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Game changer DHOP, చెర్రీ-కియారా ధోప్ సాంగ్ సోషల్ మీడియాలో షేక్ (Video)

Shiva Rajkumar: శివ రాజ్‌కుమార్‌‌కు అమెరికాలో శస్త్రచికిత్స.. నిలకడగా ఆరోగ్యం

'దేవర'తో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ - జోరు చూపలేకపోయిన శ్రీదేవి తనయ

సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ.. మెగాస్టార్ చిరంజీవి దూరం.. ఎందుకో?

Revanth reddy : సిని హీరోలు ప్రభుత్వ పథకాలకు ప్రచారం చేయాల్సిందే ?

తర్వాతి కథనం
Show comments