Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరల్డ్ కప్ ట్రోఫీతో ఐదోసారి సగర్వంగా ఆస్ట్రేలియా జట్టు!

Webdunia
ఆదివారం, 29 మార్చి 2015 (16:01 IST)
మెల్‌బోర్న్ క్రికెట్ మైదానం వేదికగా ఆదివారం జరిగిన ఐసీసీ వరల్డ్ కప్ 2015‌లో ఆస్ట్రేలియా మరోమారు జగజ్జేతగా నిలిచింది. మరో ఆతిథ్యదేశం న్యూజిలాండ్ జట్టుపై కంగారులు ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, వరల్డ్ కప్ ట్రోఫీని ఐదోసారి ముద్దాడిన జట్టుగా ఆస్ట్రేలియా సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకుంది. 
 
ఈ జట్టు గతంలో 1987, 1999, 2003, 2007 సంవత్సరాల్లో ప్రపంచ కప్ పోటీలలో విజేతగా నిలిచింది. 1987లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఫైనల్ పోరులో బోర్డర్ నేతృత్వంలో ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లాండ్‌పై 7 పరుగుల తేడాతో గెలిచి తొలిసారి ట్రోఫీని అందుకుంది. ఆ తర్వాత 1999లో లార్డ్స్ మైదానంలో పాకిస్థాన్‌తో స్టీవ్ వా కెప్టెన్సీలో తలపడిన టీం 8 వికెట్ల తేడాతో నెగ్గింది. 
 
అనంతరం రికీ పాంటింగ్ నేతృత్వంలో 2003‌లో జోహాన్స్ బర్గ్‌లోని వాండరర్ మైదానంలో భారత్‌పై 125 పరుగుల తేడాతో, 2007లో ఓవల్ మైదానంలో శ్రీలంకపై 53 పరుగులతేడాతో (డీ/ఎల్ పద్ధతిలో) విజయం సాధించి ప్రపంచ క్రికెట్ చరిత్రలో 3 వరుస విజయాలు నమోదు చేసిన ఏకైక జట్టుగా నిలిచింది. తిరిగి నేడు సొంత గడ్డపై మెల్‌బోర్న్ మైదానంలో న్యూజిలాండ్‌ను ఓడించి ఐదోసారి సగర్వంగా ట్రోఫీని అందుకుంది. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments