Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాళ్లు పాకిస్థాన్‌ను చిత్తు చేశారు... వీరు వెస్టిండీస్‌ చేతిలో ఓడారు

భారత క్రికెట్‌ అభిమానులకు ఒక శుభవార్త.. మరొకటి అశుభవార్త. భారత మహిళా క్రికెట్ జట్టు పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడిస్తే.. భారత క్రికెట్ జట్టు మాత్రం వెస్టిండీస్ చేతిలో ఓడిపోయింది. ఈ రెండు మ్యాచ్‌లు ఆదివారమ

Webdunia
సోమవారం, 3 జులై 2017 (09:46 IST)
భారత క్రికెట్‌ అభిమానులకు ఒక శుభవార్త.. మరొకటి అశుభవార్త. భారత మహిళా క్రికెట్ జట్టు పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడిస్తే.. భారత క్రికెట్ జట్టు మాత్రం వెస్టిండీస్ చేతిలో ఓడిపోయింది. ఈ రెండు మ్యాచ్‌లు ఆదివారమే జరిగాయి.
 
మహిళల ప్రపంచ కప్‌లో పాకిస్థాన్ జట్టుపై భారత జట్టు ఘన విజయం సాధించింది. పాకిస్థాన్‌పై 95 పరుగుల తేడాతో భారత జట్టు గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసి భారత్ 9 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేయగా, ఆస్కోరును ఛేదించే క్రమంలో పాకిస్థాన్ జట్టు 74 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లు బిష్ట్ 5 వికెట్లు, జోషి 2, గోస్వామి, శర్మ, కౌర్‌లు చెరో వికెట్ తీసుకున్నారు. 
 
అలాగే, కరేబియన్ దీవుల్లో పర్యటిస్తున్న టీమిండియా.. ఆదివారం అంటిగ్వా వేదికగా జరిగిన నాలుగో వన్డేలో ఆతిథ్య వెస్టిండీస్ చేతిలో ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 9 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత జట్టు 178 పరుగులకే ఆలౌట్ అయింది. 
 
వెస్టిండిస్ బ్యాట్స్‌మెన్లు లూయిస్ 35, హోప్‌ 35 ఎస్‌హోప్‌ 25 ర‌న్స్‌ స్కోరు చేయగా, భారత బౌలర్లు ఉమేష్ 3, పాండ్య 3, కుల్దీప్ 2 వికెట్లు తీశారు. భారత జట్టు బ్యాట్స్‌మెన్లు రహానే 60, ధోని 54, పాండ్య 20 పరుగులు చేశారు. వెస్టిండీస్ బౌలర్లు హోల్డర్ 5, జోసెఫ్ 2, విలియమ్స్, బిషూ, నర్స్ తలో వికెట్ తీసుకున్నారు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఐదు వికెట్లు తీసిన హోల్డర్ నిలిచాడు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments