Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళల ప్రపంచ కప్.. సెమీస్ అవకాశాలు క్లిష్టతరం.. మహిళా జట్టు?

Webdunia
శనివారం, 19 మార్చి 2022 (16:23 IST)
మహిళల ప్రపంచ కప్‌లో టీమిండియా మహిళా జట్టు సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ పరాజయం పాలైంది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో గెలవాల్సిందిపోయి.. ఓటమిని చవిచూసింది. 
 
దీంతో ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో గెలుపొంది సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 277 పరుగులు చేసింది. మిథాలీరాజ్ (68), యస్తికా భాటియా (59), హర్మన్ ప్రీత్‌కౌర్ (57 నాటౌట్), పూజా వస్త్రాకర్ (34) రాణించారు.
 
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆసీస్ 49.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 280 పరుగులు చేసింది విజయం సాధించింది.  ఈ ఓటమితో టీమిండియా సెమీస్ ఆశలు దాదాపుగా గల్లంతయ్యాయి.
 
ఒకవేళ సెమీస్‌కు వెళ్లాలంటే తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో భారత్ తప్పకుండా గెలవాల్సి ఉంటుంది. మంగళవారం బంగ్లాదేశ్, ఆదివారం సౌతాఫ్రికాతో విజయం సాధించాలి. 
 
అంతేకాదు న్యూజిలాండ్ తన తదుపరి మ్యాచ్‌లో ఓడిపోవాలి. ఇలా జరిగితేనే మనం సెమీస్‌ అవకాశాలు భారత్‌కు వుంటాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేసీఆర్‌కు పెరిగిన షుగర్ లెవెల్స్... యశోద ఆస్పత్రిలో అడ్మిట్

ఇద్దరు కొడుకులతో మంగళగిరి నివాసానికి వచ్చిన పవన్ కళ్యాణ్

గిరిజనులకు మామిడి పండ్లను బహుమతిగా పంపించిన పవన్ కళ్యాణ్

పుదుచ్చేరిలో వడ్డీ వ్యాపారుల వేధింపులతో యువకుడి ఆత్మహత్య

Husband: మహిళా కౌన్సిలర్‌ను నడిరోడ్డుపైనే నరికేసిన భర్త.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హరిహర వీరమల్లు దెబ్బకు యూట్యూబ్ షేక్... (వీడియో)

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

తర్వాతి కథనం
Show comments