Webdunia - Bharat's app for daily news and videos

Install App

2019ను ఘనంగా వీడ్కోలు పలికిన కోహ్లీ.. మళ్లీ అగ్రస్థానమే...

Webdunia
సోమవారం, 30 డిశెంబరు 2019 (18:58 IST)
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి 2019 సంవత్సరం బాగా కలిసివచ్చిందని చెప్పొచ్చు. ఈ యేడాదిలో ఆయన పరుగుల వరద పారించాడు. ముఖ్యంగా, 110.57 సగటుతో ఏకంగా 774 పరుగులు చేశాడు. ఫలితంగా ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో వరుసగా రెండోసారి అగ్రస్థానంలో నిలిచాడు. ఫలితంగా ఆయన 2019 సంవత్సరానికి ఘనంగా వీడ్కోలు పలకనున్నాడు. 
 
ఐసీసీ టెస్ట్ ర్యాంకులను తాజాగా వెల్లడించారు. ఇందులో బ్యాటింగ్ విభాగంలో కోహ్లీ వరుసగా రెండో ఏడాది అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఫలితంగా ఈ ఏడాదిని ఘనంగా ముగించినట్టు అయింది. 928 పాయింట్లతో కోహ్లీ అగ్రస్థానంలో నిలవగా, ఆసీస్ స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ 911 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. 
 
అలాగే, బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలతో జట్టులో చోటు కోల్పోయి ఏడాది తర్వాత జట్టలో చేరిన స్మిత్.. యాషెస్ సిరీస్‌లో పరుగులు వరద పారించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన ఈ సిరీస్‌లో స్మిత్ నాలుగు మ్యాచుల్లో 110.57 సగటుతో ఏకంగా 774 పరుగులు చేశాడు. దీంతో టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానానికి ఎగబాకి కోహ్లీని కిందికి నెట్టేశాడు.
 
అయితే, స్వదేశంలో దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లతో జరిగిన టెస్టు సిరీస్‌లో కోహ్లీ అద్భుతంగా రాణించడంతో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. అదేసమయంలో పాకిస్థాన్‌తో జరిగిన సిరీస్‌లో స్మిత్ పేలవ ప్రదర్శన కారణంగా దిగువకు పడిపోయాడు. అయితే, న్యూజిలాండ్ సిరీస్ రూపంలో స్మిత్‌కు మరోమారు కోహ్లీని దాటే అవకాశం వచ్చినా అంతగా రాణించలేకపోయాడు. కివీస్‌తో ఇప్పటి వరకు జరిగిన రెండు టెస్టుల్లో 37.75 సగటుతో 151 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో రెండో స్థానానికి పరిమితమయ్యాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పిఠాపురానికి పవన్ కళ్యాణ్ చేసిన పనులేంటి?

రేషన్ బియ్యం మాయం కేసు : విచారణకు హాజరైన పేర్ని నాని భార్య!

రష్యా ఎంఐ-8 హెలికాఫ్టరును కూల్చివేసిన ఉక్రెయిన్ డ్రోన్ (Video)

ఓటరు కార్డు ఉండే ఓటు వేసే హక్కు ఉన్నట్టు కాదు : ఢిల్లీ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్

భరత నాట్య కళాకారిణిని పెళ్లాడనున్న ఎంపీ తేజస్వీ సూర్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

New Year 2025, పుట్టపర్తి సత్యసాయి మందిరంలో నూతన సంవత్సర వేడుకలు: నటి సాయిపల్లవి భజన

అన్‌స్టాపబుల్ షోలో రామ్ చరణ్ కు తోడుగా శర్వానంద్ ప్రమోషన్

ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేషనల్ క్రష్ రశ్మిక మందన్నా

రెండు ముక్కలు దిశగా తెలుగు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ?

ప్రదీప్ మాచిరాజు, చంద్రిక రవిపై స్పెషల్ మాస్ సాంగ్ చిత్రీకరణ

తర్వాతి కథనం
Show comments