Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ ర్యాంకింగ్స్ టాప్-10: విరాట్ కోహ్లీ అవుట్- రవిచంద్రన్ అశ్విన్ ఇన్

Webdunia
మంగళవారం, 25 ఆగస్టు 2015 (17:01 IST)
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అనూహ్యంగా దిగజారాడు. శ్రీలంక క్రికెట్ సిరీస్‌లో ఆకట్టుకోని ఆటతీరులో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో దిగజారాడు. లంక సిరీస్‌కు ముందు టాప్ టెన్‌లో చోటు సంపాదించుకున్న కోహ్లీ, శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల తర్వాత 11వ స్థానానికి పడిపోయాడు. 
 
బంగ్లాదేశ్, శ్రీలంక టెస్టు సిరీస్‌లో విశేషంగా రాణించి సీనియర్ల మన్ననలందుకున్న రవిచంద్రన్ అశ్విన్ టెస్టు బౌలర్లలో 8వ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. అలాగే ఆల్ రౌండర్లలో అశ్విన్ రెండో ర్యాంకులో ఉన్నాడు. తద్వారా ఐసీసీ ర్యాంకింగ్స్ రెండు విభాగాల్లోనూ అశ్విన్ టాప్-10లో కొనసాగుతున్నాడు. 
 
22వ ర్యాంకులో ఉన్న రహానే శ్రీలంక సిరీస్‌లో సెంచరీ తరువాత రెండు స్థానాలు ఎగబాకి 20వ ర్యాంకును సొంతం చేసుకోగా, లంకేయులతో జరిగిన రెండు టెస్టుల్లో మూడేసి వికెట్లతో రాణించిన స్పిన్నర్ అమిత్ మిశ్రా 42 స్థానాలు మెరుగుపరుచుకుని, 39వ ర్యాంకుకు ఎగబాకాడు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments