Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగ్లాదేశ్‌ చేతిలో చిత్తుగా ఓడిన పాకిస్థాన్‌కు మరో షాక్... 1965 తర్వాత...

ఠాగూర్
గురువారం, 5 సెప్టెంబరు 2024 (14:08 IST)
స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్‌లో పాకిస్థాన్ జట్టు బంగ్లాదేశ్ జట్టు చేతిలో చిత్తుగా ఓడిపోయింది. ఈ ఓటమి నుంచి పాకిస్థాన్ క్రికెటర్లు ఇంకా కోలుకోలేదు. ఇంతలోనే మరో షాక్ తగిలింది. ఐసీసీ ర్యాంకుల పట్టికలో మరింతగా దిగజారింది. ఈ టెస్ట్ సిరీస్‌కు ముందు ఆరో స్థానంలో ఉన్న పాకిస్థాన్ జట్టు ఇపుడు ఎనిదో స్థానానికి పడిపోయింది. దీంతో 1965 తర్వాత అత్యల్ప రేటింగ్‌ పాయింట్ల 76కు చేరింది. 
 
ఇటీవల జరిగిన రెండు మ్యాచుల టెస్టు సిరీస్‌ను షాన్ మసూద్ సారథ్యంలోని పాక్ జట్టుపై బంగ్లాదేశ్ క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. తొలి టెస్టులో పాకిస్థాన్‌ను 10 వికెట్ల తేడాతో ఓడించిన బంగ్లా, రావల్పిండి వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆతిథ్య జట్టును ఆరు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ప్రస్తుతం పాక్ ఖాతాలో కేవలం 76 రేటింగ్ పాయింట్లు మాత్రమే ఉన్నాయి. దీంతో పాకిస్థాన్ 1965 తర్వాత అత్యల్ప రేటింగ్ పాయింట్ల (76)ను సాధించినట్లైంది.
 
'బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ సిరీస్ ఓటమిని చవిచూసిన పాకిస్థాన్ ఐసీసీ పురుషుల టెస్టు జట్టు ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు దిగజారి ఎనిమిదో స్థానానికి చేరుకుంది' అని ఐసీసీ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైఎస్ ఫ్యామిలీ కోసం ఇంతకాలం భరించా.. కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి : బాలినేని

తిరుమల లడ్డూ ప్రసాదంపై ప్రమాణం చేద్దామా: వైవీ సుబ్బారెడ్డికి కొలికిపూడి సవాల్

శ్రీవారి లడ్డూలో చేప నూనె - బీఫ్ టాలో - పంది కొవ్వు వినియోగం...

ఏపీలో కొత్త మద్యం పాలసీ.. రూ.99కే క్వార్టర్ బాటిల్!

తిరుపతి లడ్డూ తయారీలో ఆవు నెయ్యి స్థానంలో జంతువుల కొవ్వు కలిపారా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

తర్వాతి కథనం
Show comments