Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీ20 వరల్డ్‌కప్‌ 2021 షెడ్యూల్ విడుదల.. భారత్ తొలి మ్యాచ్ పాక్‌తోనే!

Webdunia
మంగళవారం, 17 ఆగస్టు 2021 (14:07 IST)
క్రికెట్ అభిమానులకు ఐసిసి శుభవార్త తెలిపింది. తాజాగా టీ20 వరల్డ్‌కప్‌ 2021 షెడ్యూల్ ను ఐసీసీ విడుదల చేసింది. సెప్టెంబర్ 19 నుండి అక్టోబర్ 15 వరకు ఐపీఎల్‌ రెండో దశ యూఏఈ మరియు ఒమన్‌లో పూర్తయిన వెంటనే అక్కడే ఐసీసీ వరల్డ్ కప్ అక్టోబర్ 17 నుండి సూపర్ 12 స్థానం కోసం పోటీపడే జట్లకు మ్యాచ్ లను నిర్వహించబోతుంది. ఇక తొలి టీ-20 మ్యాచ్ అక్టోబర్ 23న ఆస్ట్రేలియా-సౌతాఫ్రికాతో ప్రపంచ కప్ మొదలుకానుంది. 
 
అక్టోబర్ 24న దాయాది పాకిస్తాన్‌తో భారత్ తలపడనుంది. నవంబర్ 10,11 తేదీల్లో సెమీ ఫైనల్స్‌, నవంబర్ 14 న వరల్డ్‌ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే జట్టు జాబితాని సెప్టెంబర్ 10 లోపు పంపాలని ఐసీసీ ఆయా దేశాల క్రికెట్ సంఘాలకు తెలిపింది.
 
ఈ మెగా ఈవెంట్‌లో భారత్ తన తొలి మ్యాచ్‌ను దాయాది పాకిస్థాన్ జట్టుతో పోటీపడనుంది. అక్టోబర్ 24న దుబాయ్‌ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఇక, నవంబర్ 14న దుబాయ్‌లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. మరుసటి రోజును రిజర్వ్ డేగా ఉంచారు. ఈ మ్యాచ్‌లన్నీ భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకే ప్రారంభం కానున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టర్కీలో భూకంపం... ప్రాణభయంతో పరుగులు తీసిన ప్రజలు

హైకోర్టు తలుపుతట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఎందుకు?

ప్రధాని మోడి వెనుక ప్రపంచ నాయకులు: టెర్రరిస్టుల ఫ్యాక్టరీ పీచమణిచే సమయం వచ్చేసిందా?

చీటింగ్ కేసులో లేడీ అఘోరీకి పదేళ్ల జైలుశిక్ష తప్పదా? అడ్వకేట్ ఏమంటున్నారు?

జైలుకు వెళ్లినా నా భార్య నాతోనే ఉంటుంది : అఘోరీ (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

తర్వాతి కథనం
Show comments