Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా కల్లోలం : ఐసీసీ ట్వంటీ20 వరల్డ్ కప్ వాయిదా? ఐపీఎల్ ఖాయమా?

Webdunia
బుధవారం, 27 మే 2020 (17:14 IST)
కరోనా మహమ్మారి కారణంగా అనేక అంతర్జాతీయ క్రీడా పోటీలు వాయిదాపడుతున్నాయి. తాజాగా స్వదేశంలో జరగాల్సిన ఐపీఎల్ 11వ సీజన్ కూడా రద్దయ్యే పరిస్థితులు ఉన్నాయి. నిజానికి ఈ టోర్నీ గత మార్చి నెలలో ప్రారంభమై, మే నెలలో ముగియాల్సివుంది. కానీ, కరోనా కారణంగా ఈ టోర్నీ వాయిదాపడింది. ఇపుడు ఐసీసీ ట్వంటీ20 టోర్నీ కూడా వాయిదాపడే సూచనలు కనిపిస్తున్నాయి. 
 
ఈ టోర్నీ ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సివుంది. కానీ, ఈ టోర్నీ వాయిదాపడినట్టు వార్తలు వెలువడుతున్నాయి. దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ... ఇది నిజమేనని ఐసీసీ వర్గాలు చెపుతున్నాయి.
 
గురువారం అన్ని దేశాల క్రికెట్ బోర్డులతో జరిగే సమావేశంలో దీనిపై తుది నిర్ణయం వెలువరించే అవకాశం ఉంది. షెడ్యూల్ ప్రకారం అక్టోబరు 18 నుంచి టీ20 వరల్డ్ కప్ ఆస్ట్రేలియాలో జరగాల్సి ఉంది.
 
అయితే కరోనా కారణంగా వీసాల ప్రక్రియను ఆ దేశం ఆపేసింది. పర్యాటక వీసాలను సైతం రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పట్లో టోర్నీ జరిపేందుకు అనువైన పరిస్థితులు నెలకొనే అవకాశాలు లేకపోవడంతో.. టోర్నీని వాయిదా వేయాల్సిన పరిస్థితి నెలకొంది. 
 
అయితే, బీసీసీఐ నిర్వహించే ఐపీఎల్ 11వ అంచె పోటీలు మాత్రం వచ్చే అక్టోబరులో నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. ఇపుడు ట్వంటీ20 ప్రపంచ కప్ టోర్నీ వాయిదాపడినట్టయితే, ఖచ్చితంగా ఐపీఎల్ టోర్నీని బీసీసీఐ నిర్వహించే అవకాశాలు ఉంటాయని క్రికెట్ పండితులు భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీరాముని స్ఫూర్తితో ప్రజారంజక పాలన సాగిస్తా : సీఎం చంద్రబాబు

బెంగళూరు మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై యువ జంట: అమ్మాయి.. అబ్బాయి.. రొమాన్స్.. అలా? (video)

బీజేపీతో దోస్తీ ఎఫెక్ట్! తమిళనాడులో అన్నాడీఎంకే ఇక అంతేనా...

కుక్కపిల్లల కుస్తీ పోటీ, సినిమా చూస్తున్న కోళ్లు (video)

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

తర్వాతి కథనం
Show comments