Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్వంటీ-20 ర్యాంకింగ్స్: టాప్ స్థానాన్ని చేజార్చుకున్న కోహ్లీ.. టీమిండియాకు ఆరోస్థానం!

Webdunia
శనివారం, 10 అక్టోబరు 2015 (11:09 IST)
ఫ్రీడమ్ సిరీస్‌లో భాగంగా మెరుగ్గా రాణించలేకపోవడంతో టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ట్వంటీ-20ల్లో టాప్ ర్యాంకును కోల్పోయాడు. టీమిండియా చెత్త ప్రదర్శనతో ట్వంటీ-20 సిరీస్‌ను చేజార్చుకున్న సంగతి తెలిసిందే. డ్యాషింగ్ బ్యాట్స్‌మన్‌గా జట్టుకు వెన్నెముకగా నిలుస్తాడనుకున్న కోహ్లీ, ధర్మశాలలో జరిగిన తొలి మ్యాచ్‌లో మెరుగ్గానే రాణించినా, కటక్‌లో జరిగిన రెండో వన్డేలో సింగిల్ పరుగుకే వెనుదిరిగాడు. 
 
ఈ చెత్త ప్రదర్శన కారణంగానే చాలా కాలం నుంచి టీ20 బ్యాటింగ్ ర్యాంకుల్లో అగ్రస్థానంలో ఉన్న కోహ్లీ ఆ ర్యాంకును కోల్పోవాల్సి వచ్చింది. దీంతో పాటు ఓ మెట్టు కిందకు దిగిన కోహ్లీ ప్రస్తుతం రెండో ర్యాంకులో కొనసాగుతున్నాడు. ఇక ఆసీస్ టీ20 జట్టు కెప్టెన్ ఆరోన్ ఫించ్ అగ్రస్థానానికి ఎగబాకాడు. 
 
ఇదిలా ఉంటే, అలాగే జట్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా కూడా నాలుగో స్థానం నుంచి ఏకంగా ఆరో ర్యాంకుకు పడిపోయింది. సఫారీ జట్టు ఓ స్థానం మెరుగుపరచుకుని ఐదో ర్యాంకుకు చేరుకుంది. శ్రీలంక అగ్రస్థానంలో కొనసాగుతోంది.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments