Webdunia - Bharat's app for daily news and videos

Install App

షమీ వద్దనుకున్నా... నేను ప్రేమిస్తూనే ఉంటా : హసీన్ జహాన్

తన భర్త మహ్మద్ షమీ తనను వద్దనుకున్నా తాను మాత్రం ఆయన్ను ప్రేమిస్తూనే ఉంటానని షమీ భార్య హసీన్ జహాన్ చెప్పుకొచ్చింది. అదేసమయంలోనీ అంతు తేలుస్తానంటూ షమీకి వార్నింగ్ కూడా ఇచ్చింది.

Webdunia
బుధవారం, 28 మార్చి 2018 (09:29 IST)
తన భర్త మహ్మద్ షమీ తనను వద్దనుకున్నా తాను మాత్రం ఆయన్ను ప్రేమిస్తూనే ఉంటానని షమీ భార్య హసీన్ జహాన్ చెప్పుకొచ్చింది. అదేసమయంలోనీ అంతు తేలుస్తానంటూ షమీకి వార్నింగ్ కూడా ఇచ్చింది. 
 
ఈనెల 24వ తేదీన డెహ్రాడూన్ నుంచి కారులో ఢిల్లీ వెళ్తూ షమీ ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో షమీ గాయపడటంతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న జహాన్ చికిత్స పొందుతున్న షమీని కలిసేందుకు ఆస్పత్రికి వెళ్లింది. అయితే, షమీ ఆమెను కలిసేందుకు నిరాకరించాడు. 
 
దీనిపై జహాన్ స్పందిస్తూ, 'ప్రమాదంలో గాయపడిన షమీని కలవాలని అనుకున్నా. కానీ నన్ను కలిసేందుకు అతడు నిరాకరించాడు. అంతేకాదు, నన్ను బెదిరించాడు. ఇక మేమిద్దరం కోర్టులోనే కలుసుకుంటాం' అంటూ హెచ్చరికలు చేసింది. షమీ తన కుమార్తెతో ఆడుకున్నాడని, కానీ తనను మాత్రం కలిసేందుకు నిరాకరించాడని, షమీ తల్లి అతడికి బాడీగార్డులా పనిచేస్తున్నారని హసీన్ ఆరోపించారు.
 
అంతేకాకుండా, అతడు తనను వద్దనుకుంటున్నా, తాను మాత్రం అతడిని ప్రేమిస్తూనే ఉన్నానని, ఎందుకంటే, అతడు తన భర్త అని హసీన్ చెప్పుకొచ్చింది. పైగా, అతడు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు చెప్పిన హసీన్ ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన తర్వాత కోర్టులో కలుసుకుందామంటూ షమీకి హెచ్చరికలు పంపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

తర్వాతి కథనం
Show comments