Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినీ ఫక్కీలో ఇషాంత్-ప్రతిమల ప్రేమాయణం.. బాస్కెట్ బాల్ కోర్టులో తొలి చూపులోనే..?!

టీమిండియా బౌలర్ ఇషాంత్ శర్మ ప్రేమ వ్యవహారం సినీ ఫక్కీలో నడిచింది. ఇషాంత్ శర్మ ప్రతిమ అనే బాస్కెట్ బాల్ ప్లేయర్‌తో తొలి చూపులోనే ప్రేమలో పడ్డాడు. వీరిద్దరి ప్రేమ త్వరలో పెళ్లిదాకా రానుంది. ఇషాంత్ శర్మ

Webdunia
శుక్రవారం, 1 జులై 2016 (09:30 IST)
టీమిండియా బౌలర్ ఇషాంత్ శర్మ ప్రేమ వ్యవహారం సినీ ఫక్కీలో నడిచింది. ఇషాంత్ శర్మ ప్రతిమ అనే బాస్కెట్ బాల్ ప్లేయర్‌తో తొలి చూపులోనే ప్రేమలో పడ్డాడు. వీరిద్దరి ప్రేమ త్వరలో పెళ్లిదాకా రానుంది. ఇషాంత్ శర్మ బాస్కెట్ బాల్ కోర్టులో ప్రతిమతో ఇషాంత్‌కు తొలిపరిచయం ఏర్పడింది. 2011లో ఢిల్లీలో నిర్వహించిన టోర్నీకి ఇషాంత్ శర్మను ప్రతిమ సోదరి ఆకాంక్ష చీఫ్ గెస్టుగా ఆహ్వానించింది. 
 
ప్రతిమ సింగ్ బాస్కెట్ బాల్ ప్లేయర్.. ఆమె తోబుట్టువులు కూడా బాస్కెట్ బాల్ ప్లేయర్సే. దీంతో ప్రతిమ తొలిచూపులోనే ఇషాంత్ ప్రేమలో పడ్డాడు. అందరబ్బాయిల్లాగే ఇషాంత్ కూడా లవ్‌లో తొందరపడ్డాడు. ప్రతిమను బయటికెళ్తామా అంటూ ఆహ్వానించాడు. అయితే అక్కకు చెప్పకుండా ఏ పనీ చేయని ప్రతిమ చెప్పడంతో  ఈ విషయాన్ని కూడా ఆకాంక్షతో చెప్పింది. 
 
ఆకాంక్షకు ఇషాంత్ ఎలాంటివాడో తెలియడంతో చెల్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇలా మొదలైన వీరి ప్రేమకథ సినీ స్టోరీలా చాలా రోజుల పాటు నడిచింది. ఇక ప్రతిమను కోరిందేమిటంటే.. పెళ్ళి తర్వాత కూడా బాస్కెట్ బాల్ ఆడేందుకు పర్మిషన్ ఇవ్వాలని ప్రతి ఓ కండిషన్ పెట్టిందట. అందుకు ఇషాంత్ కూడా అడ్డు చెప్పలేదట. ఇలా ప్రేమలో పడిన ప్రతిమ-ఇషాంత్ జంట త్వరలో ప్రేమ ద్వారా ఏకం కానున్నారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments