Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉప్పల్ టెస్టు: డబుల్ సెంచరీ ప్లస్ సన్నీ రికార్డ్ బ్రేక్ చేసిన కోహ్లీ.. బంగ్లాపై భారత్ గెలుపు

బంగ్లాదేశ్‌తో ఉప్పల్ వేదికగా జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారత్ గెలుపును నమోదు చేసుకుంది. భారత్ నిర్ధేశించిన 459 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఆశించిన స్

Webdunia
సోమవారం, 13 ఫిబ్రవరి 2017 (14:50 IST)
బంగ్లాదేశ్‌తో ఉప్పల్ వేదికగా జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారత్ గెలుపును నమోదు చేసుకుంది. భారత్ నిర్ధేశించిన 459 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఫలితంగా 100.3 100.3 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్‌ 208 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ టెస్టు మ్యాచ్‌లో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీ అద్భుత రికార్డును నమోదు చేసుకున్నాడు. 
 
ఏకంగా 204 పరుగులు సాధించి.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతేగాకుండా సునీల్ గవాస్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. దీంతో సంప్రదాయ టెస్టు క్రికెట్‌లో తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. అంతకుముందు ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో విజయం సాధించిన టీమిండియా.. తాజాగా బంగ్లాతో జరిగిన ఏకైక టెస్టులోనూ గెలుపొందడం ద్వారా వరుస విజయాలతో జైత్రయాత్ర కొనసాగించినట్లైంది. 
 
ఈ టెస్టులో విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ హైలైట్ అయ్యింది. వరుస విజయాలతో జట్టును గెలిపించిన తొలి భారత కెప్టెన్‌గా కోహ్లీ రికార్డు సృష్టించాడు. తద్వారా అంతకుముందు 18 టెస్టులతో రికార్డుకెక్కిన సునీల్ గవాస్కర్ రికార్డును కోహ్లీ (19టెస్టుల్లో గెలవడం ద్వారా) బ్రేక్ చేశాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలు కానిస్టేబుల్‌ను హత్య చేసి ఠాణాలో లొగిపోయిన ఏఎస్ఐ

సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌కు కోటి రూపాయల నజరానా

ఏపీ లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు - స్వాగతించిన బీజేపీ

అక్రమ సంబంధాన్ని ప్రియుడి భార్యకు చెప్పాడనీ విలేఖరి హత్యకు మహిళ కుట్ర!!

అట్టహాసంగా మహాకాళి అమ్మవారి బోనాలు ప్రారంభం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

తర్వాతి కథనం
Show comments