Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్ట్రేలియా వర్సెస్ టీమిండియా.. పూణే టెస్టు.. తొలి రోజు స్కోర్ 256/9

ఇంగ్లండ్‌పై టెస్టు సిరీస్‌లో గెలిచిన ఊపుమీదున్న భారత టెస్టు క్రికెట్‌కు ఆస్ట్రేలియా జట్టు బ్యాట్స్‌మెన్లు కాస్త చుక్కలు చూపించారు. పూణే వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభిం

Webdunia
గురువారం, 23 ఫిబ్రవరి 2017 (18:06 IST)
ఇంగ్లండ్‌పై టెస్టు సిరీస్‌లో గెలిచిన ఊపుమీదున్న భారత టెస్టు క్రికెట్‌కు ఆస్ట్రేలియా జట్టు బ్యాట్స్‌మెన్లు కాస్త చుక్కలు చూపించారు. పూణే వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లు టీమిండియా బౌలర్లకు చుక్కలు చూపించారు. తొలిరోజు భారత బౌలర్ల ఆధిక్యానికి మిచెల్ స్టార్క్ అడ్డుకున్నాడు. దీంతో టీమిండియా బౌలర్లు పరుగులు పెట్టాల్సి వచ్చింది. 
 
ఈ క్రమంలో ఆసీస్ ఓపెనర్ రెన్ షా (64), డేవిడ్ వార్నర్ (38) మెరుగ్గా ఆడారు. కానీ ఉమేష్ యాదవ్ వార్నర్ వికెట్ తీయడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో రికార్డు సృష్టించాడు. ఒకే బ్యాట్‌మెన్‌ను ఐదు సార్లు అవుట్ చేసిన భారతీయ బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. అనంతరం క్రీజులోకి దిగిన స్టీవ్ స్మిత్ (27), షాన్ మార్ష్ (16), హ్యాండ్స్ కొంబ్ (22) తీవ్రంగా ప్రతిఘటించే ప్రయత్నం చేసినప్పటికీ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. మిచెల్ మార్ష్ (4), మాధ్యూ వేడ్ (8) అవుట్ కావడంతో స్టార్క్ క్రీజులోకి వచ్చాడు. ఆపై టీమిండియా బౌలర్లకు చుక్కలు కనిపించాయి. ఒకీఫ్ (0), లియాన్ (0) ను ఉమేష్ అవుట్ చేసి పెవిలియన్‌కు పంపాడు. చివరి వికెట్ గా హేజిల్ వుడ్ క్రీజులోకి వచ్చాడు. అతని అండతో స్టార్క్ (14) రెచ్చిపోయాడు.
 
దీంతో ఆస్ట్రేలియా జట్టు 9 వికెట్లు కోల్పోయి 256 పరుగుల వద్ద తొలిరోజు ఆటను ముగించింది. భారత బౌలర్లలో ఉమేష్ యాదవ్ 4 వికెట్లు పడగొట్టగా, అశ్విన్, జడేజా చెరో రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నారు. జయంత్ యాదవ్ ఒక వికెట్ పడగొట్టాడు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments