Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిట్నెస్‌తోనే మంచి ఆలోచ‌న‌లు : విరాట్ కోహ్లీ

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఇప్పుడు దేశంలోని ఎంతో మంది యువతకు స్ఫూర్తిదాయకం. అలాంటి కోహ్లీ తాగాజా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన అనేక అంశాలపై స్పందించారు.

Webdunia
ఆదివారం, 6 మే 2018 (16:07 IST)
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఇప్పుడు దేశంలోని ఎంతో మంది యువతకు స్ఫూర్తిదాయకం. అలాంటి కోహ్లీ తాగాజా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన అనేక అంశాలపై స్పందించారు. 
 
ముఖ్యంగా, ఫిట్నెస్‌పై కోహ్లీ స్పందిస్తూ, ఏ మనిషి అయినా ఫిట్‌గా ఉంటేనే మంచి ఆలోచనలు వస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నా ఫిట్నెస్ పెరిగే కొద్దీ నేను వీటిని గమనించాను. మనపై మనకు విశ్వాసం పెరుగుతుంది. మంచి ఆలోచనలు రావాలంటే ముందు మనం బాగుండాలి. అందుకే ఫిట్‌గా ఉండాలని నేను అందరికీ చెబుతుంటా అని వివరించారు.
 
అలాగే, తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో నేటి యువత రోజూ నాలుగు నుంచి 5 గంటల పాటు స్మార్ట్‌ఫోన్లతో గడుపుతున్నారని తేలింది. ఇది చాలా ప్రమాదకరమన్నారు. మానసిక, శారీరక వృద్ధికి ఏం చేయాలో అది చేయడం లేదన్నారు. నా చిన్నతనంలో సాధ్యమైనంత వరకు ఆరుబయట ఆడుకోవడానికే ప్రాధాన్యమిచ్చేవాళ్లం. వారాంతపు రోజుల్లో స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లలో గడిపేవాళ్లం అని కోహ్లీ వివరించాడు. 
 
అదేవిధంగా యువత చిన్నవయసు నుంచే పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. పూర్తిగా స్మార్ట్‌ఫోన్లకే బానిసైపోకుండా ఎప్పుడు ఏం చేయాలో ఒక ప్రణాళిక వేసుకోండి. ఎప్పుడు బయటకెళ్లి ఆడుకోవాలి. ఎప్పుడు హోంవర్క్ చేసుకోవాలి.. ఎప్పుడు వీడియో గేమ్స్ ఆడాలి.. ఇలా అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటేనే మంచి పౌరుడిగా ఎదుగుతారు అని కోహ్లీ వివరించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Quetta: బలూచిస్థాన్ రాజధాని క్వైట్టాను ఆధీనంలోకి తీసుకున్న బీఎల్ఏ

Pakistani drones: భారత్‌లోని 26 ప్రాంతాల్లో పాకిస్థాన్ డ్రోన్లు- భారత ఆర్మీ

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

తర్వాతి కథనం
Show comments