Webdunia - Bharat's app for daily news and videos

Install App

'14 ప్లేయర్స్-ఎ సైడ్' ప్రయోగాత్మక పద్ధతి సక్సెస్.. 19 పరుగులిచ్చి 7 వికెట్లు కొట్టిన బుడతడు..

''14 ప్లేయర్స్-ఎ సైడ్'' అనే ప్రయోగాత్మక పద్ధతి సక్సెస్ అయ్యింది. ఈ పద్ధతికి ఐడియా ఇచ్చింది ఎవరో కాదు.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. నాణ్యమైన క్రికెటర్లు టీమిండియాకు రావాలంటే 11 మందికి బదులు 15మ

Webdunia
శనివారం, 12 నవంబరు 2016 (16:20 IST)
''14 ప్లేయర్స్-ఎ సైడ్'' అనే ప్రయోగాత్మక పద్ధతి సక్సెస్ అయ్యింది. ఈ పద్ధతికి ఐడియా ఇచ్చింది ఎవరో కాదు.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. నాణ్యమైన క్రికెటర్లు టీమిండియాకు రావాలంటే 11 మందికి బదులు 15మంది ఉండాలే చూడాలని మూడేళ్ల క్రితం సచిన్.. ముంబై క్రికెట్ అసోసియేన్ (ఎంసీఏ)కు సూచించాడు.

జాతీయ జట్టులో స్థానం లభిస్తుందో లేదో అనే విషయాన్ని పక్కనబెడితే.. ఈ పద్ధతి ద్వారా ప్రతి ఆటగాడికి అవకాశం లభిస్తుందని సచిన్ సూచించాడు. తద్వారా క్రికెటర్ల ప్రతిభ బయటపడుతుందని సచిన్ సూచన చేశాడు. ఈ నేపథ్యంలో ఆనాటి సచిన్ నిర్ణయంపై ఆలోచన చేసిన ఎంసీఏ పెద్దలు దాన్ని తాజాగా అమలు చేశారు.
 
హారిస్ షీల్డ్ ఇంటర్ స్కూల్ టోర్నమెంట్ లో ఒక జట్టు 14 మందితో ఆడింది. ఇందులో భాగంగా ఎస్ కే జైన్‌తో జరిగిన మ్యాచ్‌లో బాంబే స్కాటిష్ కుర్రాడు చెలరేగిపోయాడు. ఇలా అవకాశం దక్కించుకున్న స్పిన్నర్ శివమ్ నాయక్ 19 పరుగులిచ్చి ఏడు వికెట్లతో పడగొట్టి సత్తా చాటుకున్నాడు. 
 
అంతకుముందు ఈ కుర్రాడు మెరుగ్గా ఆడుతున్నప్పటికీ ఫీల్డింగ్, బ్యాటింగ్ ప్రధానం కాబట్టి అతనికి అవకాశాలు రాలేదని బాంబే స్కాటిష్ కోచ్ నిలేష్ రావుత్ స్పష్టం చేశాడు. తాజాగా '14 ప్లేయర్స్-ఎ సైడ్' అనే ప్రయోగాత్మక పద్ధతితో అతనికి అవకాశం లభించిదని రావుత్ అన్నాడు. ప్రధానంగా సచిన్ సలహాతో ఆ కుర్రాడు ప్రతిభ వెలుగులోకి వచ్చిందని చెప్పుకొచ్చాడు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments