Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత క్రికెట్ జట్టులో మరో కపిల్ దేవ్.. ఎవరు?

భారత క్రికెట్ జట్టుకు మరో ఆల్‌రౌండర్ దొరికాడు. అటు బౌలింగ్‌తో పాటు ఇటు బ్యాట్‌తో రాణిస్తూ ప్రత్యర్థి ఆటగాళ్లను బెంబేలెత్తిస్తున్నాడు. ఆ యువ క్రికెటర్ ఎవరో తెలుసా? హార్దిక్ పాండ్య. దిగ్గజ ఆల్‌రౌండర్‌ క

Webdunia
బుధవారం, 20 సెప్టెంబరు 2017 (06:28 IST)
భారత క్రికెట్ జట్టుకు మరో ఆల్‌రౌండర్ దొరికాడు. అటు బౌలింగ్‌తో పాటు ఇటు బ్యాట్‌తో రాణిస్తూ ప్రత్యర్థి ఆటగాళ్లను బెంబేలెత్తిస్తున్నాడు. ఆ యువ క్రికెటర్ ఎవరో తెలుసా? హార్దిక్ పాండ్య. దిగ్గజ ఆల్‌రౌండర్‌ కపిల్‌ దేవ్‌ తర్వాత టీమ్‌ ఇండియాకు దొరికిన మరో ఆణిముత్యం. 
 
దీనిపై భారత జట్టు మాజీ క్రికెట్‌ మేనేజర్‌ లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌ స్పందిస్తూ, 'హార్దిక్‌ పాండ్య అమోఘమైన ఆటగాడు. అతడి సత్తా ఏంటో నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలోనే చూశాను. జోనల్‌ క్యాంప్‌లోనూ అతడు నాతో ఉన్నాడు. కపిల్‌ దేవ్‌ తర్వాత సిసలైన ఆల్‌రౌండర్‌ పాండ్య' అని ప్రశంసించాడు. 
 
హార్దిక్‌ పాండ్య బ్యాటింగ్‌ నైపుణ్యం అద్భుతం. అలవోకగా బౌండరీలు బాదగలడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లోనే పాండ్య తురుపుముక్క అని కొందరు అంటున్నారు. కానీ టెస్టుల్లోనూ పాండ్య మ్యాచ్‌ను మలుపు తిప్పగలడు. 
 
మంచి బ్యాట్స్‌మన్‌. బంతితోనూ నాణ్యమైన సీమర్‌. కళ్లుచెదిరే విన్యాసాలతో ఫీల్డింగ్‌లోనూ మెరుపే. కపిల్‌ దేవ్‌ స్థాయికి తగిన ప్రదర్శన ఇంకా చేయాల్సి ఉన్నా.. అంతటి ప్రతిభావంతుడైన ఆటగాడైతే దొరికాడని ఘంటాపథంగా చెప్పొచ్చని అభిప్రాయపడ్డాడు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments