Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ మ్యాచ్ : లక్నో ఓటమి.. గుజరాత్ విజయం

Webdunia
మంగళవారం, 29 మార్చి 2022 (09:36 IST)
ఐపీఎల్ 15వ సీజన్ టోర్నీలో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు విజయభేరీ మోగించింది. ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి లక్నో సూపర్ జెయింట్స్‌ను ఐదు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఐపీఎల్ తొలిసారి ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ రెండు జట్లూ కొత్తవి కావడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు ఆరంభంలో కాస్త తడబడింది. ఆ తర్వాత నిలదొక్కుకుని రాణించింది. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 158 పరుగులు చేసింది. 
 
లక్నో జట్టులో కెప్టెన్ రాహుల్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. అప్పటి నుంచి వికెట్లు వరుసగా కుప్పకూలాయి. ప్రత్యర్థి జట్టు బౌలరు షమీ నిప్పులు చెరిగే బంతులతో లక్నో జట్టు బ్యాటింగ్‌కు తీవ్రంగా దెబ్బతీశాడు. దీంతో ఇన్నింగ్స్ తొలి బంతికే రాహుల్ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత డికాక్ 7, లుయాస్ 10, మనీష్ పాండే 6 చొప్పున మాత్రమే పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. దీంతో లక్నో జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకునిపోయింది. అయితే, దీపక్ హుడా, ఆయూష్ బదోనీ ఇద్దరూ క్రీజ్‌లో నిలబడి జట్టును నిలబెట్టే ప్రయత్నం చేశారు. 
 
ఓ వైపు బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూనే మరోవైపు, పరుగులు రాబట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇద్దరూ అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. దీపక్ 41 బంతుల్లో 6 ఫోర్లు 2 సిక్సర్లతో 55 పరుగులు చేయగా, ఆయుష్ బదోని 41 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 54 పరుగులు చేశాడు. 
 
చివర్లో కృనాల్ పాండ్యా 13 బంతుల్లో 3 ఫోర్లతో 21 పరుగులు చేయడంతో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 158 పరుగుల గౌరవ ప్రదమైన స్కోరు చేయగలిగింది. గుజరాత్ బౌలర్లలో షమీ 3 వికెట్లు పడగొట్టగా, అరోన్ 2, రషీద్ ఖాన్‌కు ఓ వికెట్ దక్కింది. షమీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
 
ఆ తర్వాత 159 పరగులు విజయలక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టు మరో రెండు బంతులు మిగిలివుండగానే 5 వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది. తొలి ఓవర్ మూడో బంతికి గిల్ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత 15 పరుగుల వద్ద విజయ్ శంకర్ ఔటైనప్పటికీ మాథ్యువేడ్ 30, హార్థిక్ పాండ్య 33, మిల్లర్ 30 రాణించడంతో పాటు మ్యాచ్ ఆఖర్లో రాహుల్ తెవాటియా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 
 
దీంతో 24 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 40 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అభినవ్ మనోహర్ 7 బంతుల్లో 3 ఫోర్లతో 15 పరుగులు చేయడంతో మరో రెండు బంతులు మిగిలి ఉండగానే విజయం గుజరాత్ ఖాతాలో చేరింది. లక్నో బౌలర్లలో దుష్మంత చమీర 2 వికెట్లు పడగొట్టగా, అవేశ్ ఖాన్, కృనాల్ పాండ్యా, దీపక్ హుడా చెరో వికెట్ తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బెంగళూరు మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై యువ జంట: అమ్మాయి.. అబ్బాయి.. రొమాన్స్.. అలా? (video)

బీజేపీతో దోస్తీ ఎఫెక్ట్! తమిళనాడులో అన్నాడీఎంకే ఇక అంతేనా...

కుక్కపిల్లల కుస్తీ పోటీ, సినిమా చూస్తున్న కోళ్లు (video)

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

జాబ్‌మేళాకు పోటెత్తిన నిరుద్యోగులు - తొక్కిసలాటలో ముగ్గురు గాయాలు (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

తర్వాతి కథనం
Show comments