కేకేఆర్ మెంటర్ గౌతం గంభీర్‌కు బ్లాంక్ చెక్కును ఆఫర్ చేసిన షారూక్ ఖాన్!!

ఠాగూర్
సోమవారం, 27 మే 2024 (09:36 IST)
కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్ టీమ్) జట్టు మెంటర్, మాజీ క్రికెటర్ గౌతం గంభీర్‌కు ఆ జట్టు యజమాని, బాలీవుడ్ అగ్రహీరో షారూక్ ఖాన్ బ్లాంక్ చెక్కును ఆఫర్ చేశారు. దీనికి కారణం లేకపోలేదు. ఆదివారం రాత్రి చెన్నైలోని చెప్పాకం స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ 2024 సీజన్‌ అంతిమ పోరులో కేకేఆర్ జట్టు విజేతగా నిలించింది. తద్వారా రూ.20 కోట్ల ప్రైజ్ మనీని అందుకోనుంది. దీంతో కేకేఆర్ జట్టు యాజమాన్యం సంబరాల్లో మునిగిపోయింది. అయితే, ఈ సీజన్‌లో కేకేఆర్ జట్టు విజేతగా నిలవడం వెనుక మెంటర్ గౌతం గంభీర్ కీలక పాత్ర పోషించారు. మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలను మార్చడం, ఆటగాళ్లకు సూచనలు ఇవ్వడం ద్వారా జట్టుని విజేతగా నిలపడంలో తనవంతు పాత్ర పోషించాడు. 
 
ఈ నేపథ్యంలో గెలిచిన నేపథ్యంలో గంభీర్‌కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఐపీఎల్ 2023 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ కోచ్‌గా వ్యవహరిస్తున్న సమయంలో కోల్‌కతా జట్టుకు మెంటార్‌గా రావాలంటూ గౌతమ్ గంభీర్‌ను షారుఖ్ ఖాన్ కోరారని, ఇందుకుగానూ ఏకంగా 'బ్లాంక్ చెక్'ను ఆఫర్ చేశారని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. పదేళ్లపాటు కోల్‌కతా జట్టుకి పనిచేయాలంటూ షారుఖ్ అడిగారని తెలిపింది. గంభీర్‌ను ఎక్కువ కాలం పాటు జట్టుతో ఉంచాలనే ఉద్దేశంతో షారుఖ్ ఈ భారీ ఆఫర్ చేసినట్టు పేర్కొంది. కాగా కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు షారుఖ్ ఖాన్ సహ యజమాని అనే విషయం తెలిసిందే.
 
కాగా టీమిండియా కోచ్ రేసులో మాజీ క్రికెటర్ గౌతమ్ ముందు వరుసలో ఉన్నాడని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. పలువురు విదేశీ కోచ్‌ రేసు నుంచి తప్పుకోవడంతో బీసీసీఐ ముందు పెద్దగా ఆప్షన్లు లేవని, టీమ్ ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ వారసుడు గౌతమ్ గంభీరేనని చెబుతున్నాయి. మరోవైపు గంభీర్ కూడా భారత కోచ్ పదవిపై ఆసక్తి చూపుతున్నట్లు 'దైనిక్ జాగరణ్' కథనం పేర్కొంది. ఒకవేళ టీమిండియా కోచ్చ్‌గా వ్యవహరిస్తే కోల్‌కతా జట్టుకు మెంటార్గా కొనసాగడం కుదురుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Google‌కి బాబు ఇచ్చిన ప్రోత్సహకాలు చూసి గుడ్లు తేలేస్తున్న కర్నాటక ఐటి మినిస్టర్ (Video)

మంత్రి నారాయణగారు నన్నేమన్నారో చూపించండి: వర్మ సూటి ప్రశ్న (video)

కొండా సురేఖ ఇంట్లో అర్థరాత్రి హైడ్రామా.. మా అమ్మ ఇంటికొచ్చి కన్నీళ్లు పెట్టుకునేది? (video)

ఏపీ అభివృద్ధికి డబుల్ ఇంజిన్ సర్కారు : ప్రధాని నరేంద్ర మోడీ

కర్ణాటక మంత్రులు వర్సెస్ నారా లోకేష్‌ల స్పైసీ వార్... రాయితీలిస్తే ఏపీకి పెట్టుబడులు రావా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

తర్వాతి కథనం
Show comments