Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతలో పని చేసేది స్పిన్‌ మంత్రమే: ఆసీస్‌కి ఘోర పరాజయం తప్పదన్న గంగూలీ

భారతలో పని చేసేది స్పిన్‌ మంత్రమే కాబట్టి ఈ నెల చివరినుంచి జరిగే టెస్ట్ సీరీస్‌లో టీమ్ ఆస్ట్రేలియాకు ఘోర పరాజయం తప్పదని భారత క్రికెట్ మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ అభిప్రాయపడ్డాడు. పటిష్టమైన స్పిన్‌ బౌలింగ్‌ కారణంగానే 2012 నుంచి స్వదేశంలో టీమిండియాకు

Webdunia
సోమవారం, 13 ఫిబ్రవరి 2017 (04:31 IST)
భారతలో పని చేసేది స్పిన్‌ మంత్రమే కాబట్టి ఈ నెల చివరినుంచి జరిగే టెస్ట్ సీరీస్‌లో టీమ్ ఆస్ట్రేలియాకు ఘోర పరాజయం తప్పదని భారత క్రికెట్ మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ అభిప్రాయపడ్డాడు. పటిష్టమైన స్పిన్‌ బౌలింగ్‌ కారణంగానే 2012 నుంచి స్వదేశంలో టీమిండియాకు ఎదురులేకుండా పోయిందని గంగూలీ చెప్పాడు. ‘మిశ్రాకు బంతిని ఇస్తే.. అతను మ్యాచ్‌ విన్నర్‌ అవుతున్నాడు. కొత్తగా చాహల్‌, జయంత్ యాదవ్‌లకు బంతినిస్తే వాళ్లు కూడా గెలిపించేస్తున్నారు. భారతలో పని చేస్తుంది స్పిన్‌ మంత్రమేన’ని దాదా అన్నాడు. 
 
భారత్‌లో ఆస్ట్రేలియాకు గడ్డు కాలమేనని మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ అభిప్రాయపడ్డాడు. కంగారూలు వైట్‌వాష్‌కు గురైనా తానేమీ ఆశ్చర్యపోనని అన్నాడు. ఈ నెల 23 నుంచి భారతలో ఆస్ట్రేలియా పర్యటన మొదలు కానుంది. ‘ఆసీస్‌కు కష్ట కాలమే. స్మిత సేన 0-4తో ఓడినా పెద్దగా ఆశ్చర్యపడన’ని గంగూలీ అన్నాడు. 
 
విరాట్‌ కోహ్లీ అద్భుత బ్యాట్స్‌మన్‌ అని గంగూలీ కితాబిచ్చాడు. కోహ్లీ ఫిట్‌నెస్‌ అమోఘం అని చెప్పాడు. విరాట్‌ కెప్టెన్సీలో టీమిండియా సరికొత్త స్థాయికి చేరుకుంటుందనే ఆశాభావం వ్యక్తం చేశాడు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments