Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెప్పులు అమ్ముకుంటున్న పాకిస్థాన్ అంపైర్

Webdunia
శుక్రవారం, 24 జూన్ 2022 (15:28 IST)
పాకిస్థాన్ దేశంలో క్రికెటర్లతో పాటు.. ఆ దేశానికి అంపైర్ల పరిస్థితి దయనీయంగా మారుతోంది. అనేక ప్రపంచ దేశాలు పాకిస్థాన్ దేశంలో క్రికెట్ ఆడేందుకు పెద్దగా ఆసక్తి చూపించడంలేదు. దీంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఆదాయం కనుమరుగైంది.

పైగా, ఆ దేశం కూడా ఆర్థిక కష్టాల్లో చిక్కుకునివుంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) అంపైర్ ఎలైట్ జాబితాలో ఒకపుడు అగ్రగామి అంపైర్‌గా సేవలు అందించి అసద్ రవుఫ్ ఇపుడు బతుకుదెరువుకోసం చెప్పులు అమ్ముకుంటున్నారు. పాకిస్థాన్‌లోని లాహోర్ నగరంలో బట్టలు చెప్పుల దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. 
 
ఈయన గత 2000 నుంచి 2013 మధ్య కాలంలో 49 టెస్ట్ మ్యాచ్‌లకు, 98 వన్డేలకు, 23 టీ20 మ్యాచ్‌లకు అంపైరింగ్ బాధ్యతలను నిర్వహించారు. ఆ తర్వాత ఆయన ఆర్థిక పరిస్థితి క్రమంగా దిగిజారిపోతూ వచ్చింది. దీనికితోడు కరోనా వైరస్ మహమ్మారి కారణంగా తీవ్రమైన ఆర్థిక కష్టాల్లో కూరుకున్నారు. దీంతో బతుకుదెరువు కోసం గత 2022 నుంచి ఆయన లాహోర్‌లో చెప్పులు, బట్టల దుకాణం నడుపుతున్నారు. 
 
తన పరిస్థితిపై అంపైర్ అసద్ రవుఫ్ మాట్లాడుతూ, 'నేను నా కెరీర్‌లో చాలా మ్యాచ్‌లకు అంపైరింగ్ చేశాను. ఇక నేను అక్కడ కొత్తగా చూడాల్సిందేమీ లేదు. 2013 నుంచి నేను మళ్లీ ఆ వైపు చూడలేదు. ఎందుకంటే నేనొక్కదానిని వదిలిపెడితే మళ్లీ జీవితంలో దాని ముఖం చూడను" అని వ్యాఖ్యానించారు. 
 

సంబంధిత వార్తలు

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

తర్వాతి కథనం
Show comments