Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచంలో అతి పెద్ద క్రికెట్ స్టేడియం భారత్‌లోనే...

మొతేరా ప్రాంతంలో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు పరిమళ్ నథ్వాని ఇతర ఆఫీసు సిబ్బందితో కలిసి కొత్త క్రికెట్ స్టేడియంకి శంకుస్థాపన చేశారు.

Webdunia
మంగళవారం, 17 జనవరి 2017 (02:47 IST)
ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియంకి సోమవారం శంకుస్థాపన చేశారు. గుజరాత్ రాష్ట్రం అహమ్మదాబాద్ లోని మొతేరా ప్రాంతంలో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు పరిమళ్ నథ్వాని ఇతర ఆఫీసు సిబ్బందితో కలిసి కొత్త క్రికెట్ స్టేడియంకి శంకుస్థాపన చేశారు. ఇప్పటికే అక్కడ ఉన్న సర్దార్ పటేల్ స్టేడియం స్థానంలో ఈ అతిపెద్ద స్టేడియం నిర్మించనున్నారు. ఈ భారీ స్టేడియం నిర్మాణానికి దాదాపు 700 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా. పాత సర్దార్ పటేల్ గుజరాత్ స్టేడియం స్థానంలో కొత్త స్టేడియంని రెండేళ్లలో నిర్మిస్తామని నథ్వాని తెలిపారు. 
 
మోతేరాలో నిర్మిచనున్న ఈ కొత్త స్టేడియం ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం అని దీని సీటింగ్ సామర్థ్యం 1.10 లక్షల మేరకు ఉంటుందని తెలిపారు. ఇంతవరకు ప్రపంచంలో అతి పెద్ద స్టేడియంగా మెల్‌బోర్న్ స్టేడియంలో 90 వేలమంది మాత్రమే పడతారని చెప్పారు. మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం నిర్మించిన సంస్థే గుజరాత్‌లో ఈ భారీ స్టేడియంని నిర్మించనుందని తెలిపారు. 
 
54 వేలమంది ప్రేక్షకులు కూర్చొనగలిగే సర్దార్ పటేల్  స్టేడియంని ఇటీవలే కూల్చి వేశారు.
 
ఈ కొత్త ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ. 700 కోట్లు. స్టేడియంలో 76 కార్పొరేట్ బాక్సులు, 4 డ్రెస్సింగ్ రూమ్‌లు, ఒక క్లబ్ హౌస్, ఒక ఒలింపిక్ సైజ్ ఈత కొలను ఉంటాయని నత్వాని చెప్పారు. టెండర్ ప్రక్రియలో ఇంజనీరింగ్ సంస్థ ఎల్&టి ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులను దక్కించుకుంది. 
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

మద్యం కిక్కుతో విద్యుత్ తీగలపై హాయిగా పడుకున్న తాగుబోతు (video)

కొత్త సంవత్సరం రోజున ప్రజలకు చేరువగా గడిపిన సీఎం బాబు... ఏకంగా 2 వేల మందితో ఫోటోలు..

తొక్కిసలాట ఘటనపై వివరణ ఇవ్వండి.. టీ డీజీపీకి ఎన్.హెచ్.ఆర్.సి నోటీసులు

సమస్యకు ఉంటే ప్రజలు మా వద్దకు వస్తారు... ఓట్ల వద్దకు వచ్చేసరికి : రాజ్‌ఠాక్రే

సంక్రాంతి స్పెషల్ రైళ్లు - రేపటి నుంచి బుక్కింగ్స్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాకు బీపీ, షుగర్, కిడ్నీలు ఫెయిల్... పవన్ దేవుడు ఆదుకున్నారు: ఫిష్ వెంకట్ (video)

New Year 2025, పుట్టపర్తి సత్యసాయి మందిరంలో నూతన సంవత్సర వేడుకలు: నటి సాయిపల్లవి భజన

అన్‌స్టాపబుల్ షోలో రామ్ చరణ్ కు తోడుగా శర్వానంద్ ప్రమోషన్

ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేషనల్ క్రష్ రశ్మిక మందన్నా

రెండు ముక్కలు దిశగా తెలుగు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ?

తర్వాతి కథనం
Show comments