Webdunia - Bharat's app for daily news and videos

Install App

వయసు 63 యేళ్లు.. మూడో పెళ్లి చేసుకుని ఏం చేయను?: పెళ్లి వదంతులపై ఇమ్రాన్ ఖాన్

మూడో పెళ్లి చేసుకోబోతున్నట్టు వచ్చిన వార్తలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్, తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. తనకు ఇపుడు 63 యేళ్లు. ఈ వయసులో మూడో పెళ్లి చేసుకుని ఏం చేయను అంటూ మీడి

Webdunia
మంగళవారం, 12 జులై 2016 (20:42 IST)
మూడో పెళ్లి చేసుకోబోతున్నట్టు వచ్చిన వార్తలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్, తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. తనకు ఇపుడు 63 యేళ్లు. ఈ వయసులో మూడో పెళ్లి చేసుకుని ఏం చేయను అంటూ మీడియాను ప్రశ్నించాడు.
 
తాజాగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ బ్యాచిలర్ లైఫ్ బోరు కొడుతోందని, మూడో పెళ్లి చేసుకోవాలని ఉందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుని మూడో పెళ్లికి సిద్ధమవుతున్న 63 ఏళ్ల ఖాన్ ఘాటు వ్యాఖ్యలు మీడియాలో పెద్ద ఎత్తున ప్రచురితమయ్యాయి. 
 
ఈ వార్తలపై ఆయన స్పందించారు. మూడో పెళ్లి వార్తలన్నీ పూర్తిగా నిరాధారపూరితమైనవన్నారు. ఒకవేళ తాను కనుక పెళ్లి చేసుకుంటే అందరికీ చెప్పే చేసుకుంటానని, పెద్ద ఎత్తున వేడుక కూడా ఏర్పాటు చేస్తానని చెప్పుకొచ్చారు.
 
కానీ, పాకిస్థాన్‌కు చెందిన ఓ వార్తా పత్రిక మాత్రం ఇమ్రాన్ మూడో పెళ్లి చేసుకున్నట్టు ఓ వార్తా కథనాన్ని ప్రచురించింది. పైగా.. వధువు కూడా ఇమ్రాన్‌ ఖాన్‌కు అధ్యాత్మిక గురువుగా వ్యవహరిస్తున్న బుష్రా సోదరే ఆమె అని రాసింది. ఇద్దరు పిల్లలకు తల్లయిన ఆమె భర్త నుంచి విడాకులు తీసుకున్నట్టు పేర్కొంది. 

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

తర్వాతి కథనం
Show comments