Webdunia - Bharat's app for daily news and videos

Install App

సచిన్‌ను తక్కువ చేసిన ఐసీసీ.. ఎందుకని?

Webdunia
బుధవారం, 28 ఆగస్టు 2019 (16:26 IST)
అవును. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ను ఐసీసీ తక్కువ చేసింది. బెన్ స్టోక్స్‌ను సచిన్ టెండూల్కర్‌తో పోలుస్తూ ఐసీసీ చేసిన ట్వీట్ సచిన్ అభిమానులకు చిర్రెత్తుకొచ్చింది. లార్డ్స్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో బెన్ స్టోక్స్ 84 పరుగులతో అజేయంగా నిలిచి ఇంగ్లాండ్ తొలిసారి వరల్డ్‌కప్‌ను కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. 
 
ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనకు గాను బెన్ స్టోక్స్ అనంతరం నిర్వహించిన అవార్డుల కార్యక్రమంలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ చేతుల మీదగా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోని ఐసీసీ తన ట్విట్టర్‌లో పోస్టు చేస్తూ "ది గ్రేటెస్ట్ క్రికెటర్ ఆఫ్ ఆల్‌టైమ్‌తో సచిన్ టెండూల్కర్" అంటూ కామెంట్ పెట్టింది.
 
అప్పట్లో ఈ ట్వీట్‌పై సచిన్ అభిమానులు మండిపడ్డారు. తాజాగా లీడ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టులో సెంచరీ సాధించి బెన్ స్టోక్స్ ఇంగ్లాండ్‌ను గెలిపించడంతో సచిన్ టెండూల్కర్‌తో కలిసి దిగిన వరల్డ్‌కప్ ఫోటోను రీట్వీట్ చేస్తూ "ముందే చెప్పాగా?" అంటూ బుధవారం మరో ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సచిన్ అభిమానులకు కోపాన్ని తెప్పిస్తుంది. సచిన్‌తో బెన్ స్టోక్స్‌ను పోల్చడమా అంటూ ఆతని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments