Webdunia - Bharat's app for daily news and videos

Install App

షూ అడ్డుకుంది.. అంతే అవుట్ అయ్యాడు.. డేవిడ్ వార్నర్ పాపం

Webdunia
బుధవారం, 13 సెప్టెంబరు 2023 (16:41 IST)
David Warner
దక్షిణాఫ్రికాకు పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్ మొదటి రెండు పోటీల్లో ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించింది. ఈ రెండు జట్లకు మధ్య జరిగిన మూడో వన్డే మ్యాచ్ మంగళవారం జరిగింది. 
 
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ దిగిన దక్షిణాఫ్రికా జట్టు 6 వికెట్లు కోల్పోయి 338 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా జట్టులో మార్కమ్ 102 పరుగులను, డి కాక్ 82 పరుగులు సాధించారు. 
 
దీంతో 339 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు 34.3 ఓవర్లలో 227 పరుగులతో అన్ని వికెట్లు కోల్పోయి వైఫల్యాన్ని ఎదుర్కొంది. దీంతో దక్షిణ ఆఫ్రికా జట్టు 111 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 
 
ఈ పోటీలో ఆస్ట్రేలియా జట్టు డేవిడ్ వార్నర్ అవుట్ అయిన విషయం తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లను, క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకట్టుకుంటోంది. డేవిడ్ వార్నర్ ఈ మ్యాచ్‌లో 78 పరుగులు సాధించాడు. 56 బంతులకు 78 పరుగులు చేశాడు. 
 
అందులో 10 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. అయితే అతను అవుటైన వీడియో నెట్టింటిని షేక్ చేస్తోంది. షూ అడ్డుకోవడంతో డేవిడ్ వార్నర్ అవుట్ కావడం క్రికెట్ అభిమానులను నిరాశ పరిచింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

100 మంది అమ్మాయిల్లో నలుగురే పవిత్రులు: ప్రేమానంద్ వివాదాస్పద వ్యాఖ్యలు

ఏపీకి అనుకూలంగా విధానాలను అనుసరిస్తున్న కాంగ్రెస్ సర్కార్: కేసీఆర్ ఫైర్

Prakash Raj: బెట్టింగ్ యాప్‌ కేసు.. ఈడీ ముందు హాజరైన ప్రకాష్ రాజ్

మణికొండలో దారుణం : వాటర్ ట్యాంకు ఢీకొని టెక్కీ దుర్మరణం

ఒక్కో బిడ్డను కంటే నగదు బహుమతి... చైనా సరికొత్త ప్రణాళిక

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం-ఆమె తండ్రి క‌న్నుమూత‌

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

తర్వాతి కథనం
Show comments