Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై టెస్ట్ : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్

ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ ఆరంభమైంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. గత రెండు మ్యాచ్‌ల్లో అద్భుత విజయాలతో జోరుమీదున్న

Webdunia
గురువారం, 8 డిశెంబరు 2016 (09:44 IST)
ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ ఆరంభమైంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. గత రెండు మ్యాచ్‌ల్లో అద్భుత విజయాలతో జోరుమీదున్న విరాట్ కోహ్లీ సేన మరోసారి ప్రత్యర్థిపై పంజా విసిరి ఇక్కడే సిరీస్‌ను దక్కించుకోవాలని తహతహలాడుతోంది. ఇప్పటికే 2-0తో ఆధిక్యంలో ఉన్నందున కనీసం డ్రా చేసుకున్నా కూడా సిరీస్‌ ఆతిథ్య జట్టుదే అవుతుంది. అదే జరిగితే మనపై 2011 (ఇంగ్లండ్‌), 2012 (భారత), 2014 (ఇంగ్లండ్‌)లలో వరుసగా మూడు టెస్టు సిరీస్‌లు నెగ్గిన ఇంగ్లండ్‌ హ్యాట్రిక్‌ గెలుపు జోరుకు బ్రేక్ పడినట్టే. 
 
ఈ పర్యటనలో సిరీస్‌ నెగ్గే చాన్స్‌ ఎలాగూ లేనందున కనీసం డ్రా చేసుకోవాలన్నా మిగతా రెండు మ్యాచ్‌లూ నెగ్గాల్సిన నేపథ్యంలో ఒత్తిడంతా ఇంగ్లండ్‌పైనే ఉండనుంది. భారత జట్టును ఆటగాళ్ల గాయాలు ఇబ్బంది పెడుతున్నా ముంబైలో మన జట్టే ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్‌లో భారత్, ఇంగ్లండ్ రెండేసి మార్పులు చేశాయి. భారత జట్టులో గాయపడిన షమి, రహానే స్థానంలో లోకేష్ రాహుల్, భువనేశ్వర్ జట్టులోకొచ్చారు. అలాగే, ఇంగ్లండ్ హమీద్, బాటీ స్థానంలో కీటన్, బాల్‌ను జట్టులోకి తీసుకుంది. 
 
ఇదిలావుండగా, ఈ మ్యాచ్‌లో నెగ్గితే 1985-87 మధ్య కాలంలో వరుసగా అత్యధికంగా 17 మ్యాచ్‌ల్లో పరాజయం ఎరుగని రికార్డును భారత సమం చేస్తుంది. 16 గతేడాది శ్రీలంకతో గాలె టెస్టు ఓటమి తర్వాత భారత పరాజయం ఎరుగని మ్యాచ్‌లు. 12 మ్యాచ్‌ల్లో నెగ్గి, నాలుగింటిని డ్రా చేసుకుంది 2 వాంఖడేలో ఆడిన గత రెండు మ్యాచ్‌ల్లోనూ ఇంగ్లండ్‌ నెగ్గింది. ఇక్కడ 24 మ్యాచ్‌ల్లో భారత పదింట్లో గెలిచింది 41 టెస్టుల్లో నాలుగు వేల పరుగుల మైలురాయిని చేరుకునేందుకు విరాట్ కోహ్లీ అతిచేరువలో ఉన్నాడు. 
 
ఇరు జట్ల వివరాలు...
భారత్ : మురళీ విజయ్, రాహుల్, పుజారా, విరాట్ కోహ్లీ, నాయర్, అశ్విన్, పార్థివ్, జడేజా, జయంత్ యాదవ్, భువనేశ్వర్, ఉమేష్ యాదవ్.
ఇంగ్లండ్: కుక్, కీటన్ జెన్నింగ్స్, రూట్, అలీ, స్టోక్స్, బెయిర్‌స్టో, బట్లర్, వోక్స్, రషీద్, అండర్సన్, జేటీ.బాల్.
అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్తతో శృంగారానికి నిరాకరిస్తే విడాకులు ఇవ్వొచ్చు : బాంబే హైకోర్టు

ఆ కూలీకి ఆరు రూపాయలతో రూ.కోటి అదృష్టం వరించింది... ఎలా?

women: మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక.. సీతక్క

స్వర్ణాంధ్ర 2047-వికాసిత్‌ భారత్ 2047 కోసం అంకితభావంతో పనిచేస్తాం.. పవన్ కల్యాణ్

"3.0 లోడింగ్... 2028లో రప్పా రప్పా".. ఖమ్మంలో కేటీఆర్ ఫ్లెక్సీలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అవి మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లా మారిపోయాయి : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి

తర్వాతి కథనం
Show comments