Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడో టెస్ట్ : ఇంగ్లండ్ వెన్ను విరిచిన అక్షర్ పటేల్

Webdunia
బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (18:45 IST)
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన మోతేరా స్టేడియంలో ఇంగ్లండ్ - భారత్ క్రికెట్ జట్ల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ బుధవారం ప్రారంభమైంది. డే అండ్ నైట్ తరహాలో జరుగుతున్న ఈ టెస్ట్ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన ఇంగ్లండ్.. తొలుత బ్యాటింగ్‌‍ ఎంచుకుంది. అయితే, భారత స్పిన్నర్ల దెబ్బకు ఇంగ్లండ్ వణికిపోయింది. భారత స్పిన్నర్లు చెలరేగడంతో 48.4 ఓవర్లలో కేవలం 112 పరుగులకే ఆలౌట్ అయింది. ముఖ్యంగా అక్సర్ పటేల్, అశ్విన్‌లు రెచ్చిపోయారు.
 
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌ను ఆదిలోనే పేసర్ ఇశాంత్ శర్మ దెబ్బ తీశాడు. జట్టు స్కోరు 2 పరుగులు ఉన్నప్పుడు ఓపెనర్ సిబ్లీని (డకౌట్) ఇశాంత్ ఔట్ చేశాడు. ఆ తర్వాత మన స్పిన్నర్ల దెబ్బకు ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్ వరుసగా పెవిలియన్ చేరారు. ఇంగ్లండ్ జట్టులో క్రాలీ మాత్రమే అత్యధికంగా 53 పరుగులు చేశాడు. 
 
మిగిలిన ఆటగాళ్ళలో బెయిర్ స్టో (0), జో రూట్ (17), స్టోక్స్ (6), పోప్ (1), ఫోక్స్ (12), ఆర్చర్ (11), లీచ్ (3), బ్రాడ్ (3) పరుగులు చేశారు. అండర్సన్ పరుగులేమీ చేయకుండా నాటౌట్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో అక్సర్ పటేల్ 6, అశ్విన్ 3 వికెట్లు తీయగా ఇశాంత్ శర్మ ఒక వికెట్ తీశాడు. ప్రస్తుతం భారత్ తన తొలి ఇన్నింగ్స్ చేపట్టింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో జీబీఎస్ మరణం : ఏపీ సర్కారు అలర్ట్

పోటు మీద పోటు పొడుస్తూ వ్యక్తిపై కత్తులతో దాడి.. (Video)

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

పెళ్లి ఊరేగింపు: గుర్రంపై ఎక్కిన వరుడు గుండెపోటుతో మృతి (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

తర్వాతి కథనం