Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్ ద్రావిడ్ అంటేనే భయం.. నిద్రలేని రాత్రులు గడిపా: షోయబ్ అక్తర్

Webdunia
శుక్రవారం, 21 ఆగస్టు 2015 (10:46 IST)
పాకిస్థాన్ బౌలర్ షోయబ్ అక్తర్ అంటేనే బ్యాట్స్‌మెన్లకు దడ. అక్తర్ బంతుల్ని ఎదుర్కోవడం ఎవరికైనా కాస్త ఇబ్బందే. అల్లంత దూరం నుంచి అతడు పరిగెత్తుకుంటూ వస్తున్న వైనమే ఎదుటి బ్యాట్స్ మన్‌కు ముచ్చెమటలు పట్టిస్తుంది. అయితే అతడి బంతులను సచిన్ సహా రాహుల్ ద్రావిడ్ లాంటి భారత బ్యాట్స్ మెన్ సమర్థంగానే ఎదుర్కొన్నారు. అయితే బ్యాట్స్‌మెన్లకు చుక్కలు చూపించిన అక్తర్‌కు.. టీమిండియా ది వాల్ రాహుల్ ద్రవిడ్ అంటేనే భయమట. ఈ విషయాన్ని అక్తరే స్వయంగా చెప్పాడు. 
 
అయితే, తనకు ఎదురైన బ్యాట్స్ మెన్ అందరిలోకెల్లా తాను ఒక్క రాహుల్ ద్రావిడ్‌కు మాత్రమే భయపడ్డానని ‘రావల్పిండి ఎక్స్ ప్రెస్’గా పేరుపడ్డ అక్తర్ వెల్లడించాడు. శారీరకంగా మాత్రమే కాకుండా మానసికంగానూ బౌలర్ అలసిపోయేలా దెబ్బకొట్టగల సత్తా ఒక్క ద్రావిడ్‌కు మాత్రమే సొంతమని తెలిపాడు. ద్రావిడ్‌ను పెవిలియన్ చేర్చాలంటే, ఒక్క వసీం అక్రమ్ వల్లే సాధ్యపడేదన్నాడు. 
 
వెరసి రాహుల్ ద్రావిడ్ అలనాటి ప్రపంచ బాక్సర్ మహ్మద్ అలీతో సమానమని కూడా షోయబ్ అక్తర్ పేర్కొన్నాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ కన్నా, రాహుల్ ద్రావిడ్ అంటేనే తాను బెంబేలెత్తిపోయానని కూడా అక్తర్ పేర్కొన్నాడు. రాహుల్ ద్రావిడ్ వల్ల నిద్రలేని రాత్రులు కూడా గడిపానని కూడా అతడు చెప్పాడు.

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

Show comments