Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహ్లీ సపోర్ట్ చేసిన దినేశ్ కార్తీక్: మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత!

Webdunia
సోమవారం, 18 మే 2015 (15:00 IST)
సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ అంపైర్‌తో వాగ్వివాదానికి దిగాడు. జోరుగా వర్షం కురుస్తున్నా మ్యాచ్‌ను కొనసాగిస్తున్న అంపైర్ తీరుపై కోహ్లీ మండిపడ్డాడు.

అప్పటిదాకా అక్కడికి దూరంగా ఉన్న దినేశ్ కార్తీక్ ఒక్కసారిగా కోహ్లీ వద్దకు వచ్చి, అంపైర్‌తో వాదనకు దిగాడు. ఈ విషయం వివాదాస్పదమైంది. దీనిని బీసీసీఐ విచారణ చేపట్టింది. ఈ విచారణలో కోహ్లీని తప్పుబట్టని బీసీసీఐ, దినేశ్ మాత్రం అంపైర్‌పై అనుచితంగా ప్రవర్తించాడని తేల్చింది. 
 
లెవెల్ 1 నిబంధనలను దినేశ్ అతిక్రమించాడని భావించింది. దీంతో అతడి మ్యాచ్ ఫీజులో 20 శాతానికి కోత పెట్టింది. గొడవ మొదలుపెట్టిన కోహ్లీని వదిలేసి, అతడికి మద్దతుగా వెళ్లిన దినేశ్‌కు జరిమానా పడటం విశేషం. దీంతో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ అనవసరంగా జరిమానాకు గురయ్యాడు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం